ఏపీఎంపై వెలుగు వీవోల ఫిర్యాదు
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:29 AM
మండలంలో పనిచేస్తున్న వీవోఏలు ఇచ్చిన ఫిర్యాదుపై వెలుగు ఏపీఎం ఈవీ కిషోర్‌ను సెర్ప్ సంస్థకు సరెండర్ చేస్తూ కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
పార్వతీపురం ఆంధ్రజ్యోతి /కురుపాం: మండలంలో పనిచేస్తున్న వీవోఏలు ఇచ్చిన ఫిర్యాదుపై వెలుగు ఏపీఎం ఈవీ కిషోర్‌ను సెర్ప్ సంస్థకు సరెండర్ చేస్తూ కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మం డలంలో పనిచేస్తున్న వీవోఏలకు ఇచ్చిన గౌరవ వేతనం నుంచి కొంత మొత్తాన్ని తీసుకుంటున్నారని వారు ఫిర్యాదు చేశారు. అలాగే కురుపాంలో ఓ మహిళా పొదు పు సంఘంలో ఉన్న ఆరుగురు సభ్యులు స్త్రీనిధిలో రూ.3లక్షల రుణం తీసుకున్న డబ్బులు వెలుగు కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తి సమీప బందువు ఖాతాలోనికి మళ్లించి ఫిర్యాదు చేయడంతో, నిధులు దుర్వినియోగం చేస్తున్నారని సెర్ప్ సీఈవో, కలెక్టర్, ఉన్నతాధికారులకు వీవోలు ఫిర్యాదు చేయడంతో, కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశాలతో డీఆర్‌డీఏ పీడీ విచారణ చేసి ఆర్థిక అవకతవకలు గుర్తించినట్టు తెలిసింది. డీఆర్‌డీఏ పీడీ ఇచ్చిన నివేదిక మేరకు కలెక్టర్ శ్యాంప్రసాద్ సెర్ప్ సంస్థకు సరెండర్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.