Share News

మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

ABN , Publish Date - Dec 01 , 2024 | 12:47 AM

విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వసతి గృహంలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని లీగల్‌ కమిటీ చైర్మన్‌, ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ విజయ్‌రాజ్‌ కుమార్‌ తెలిపారు.

 మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

వంగర, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వసతి గృహంలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని లీగల్‌ కమిటీ చైర్మన్‌, ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ విజయ్‌రాజ్‌ కుమార్‌ తెలిపారు. శనివారం ఆంధ్రజ్యోతిలో అన్నీ సమస్యలే శీర్షిక వచ్చిన కఽథనానికి ఆయన స్పందించారు. సీతారాంపురం వసతి గృహానికి చేరుకుని తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌ పై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడగా వారు పలు సమస్యలను ఆయనకు తెలపడంతో వెంటనే పరిష్కరించాలని వసతి గృహ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జడ్పీ విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Dec 01 , 2024 | 12:47 AM