వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: ఎంపీడీవో
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:17 AM
గ్రామాల్లో వ్యాధులు విజృంభించకుండా అప్రమత్తంగా ఉండా లని ఎంపీడీవో పి.పైడితల్లి, ఈవోపీఆర్డీ ఎల్.గోపాలరావు సూచించారు. బుధవా రం మండలంలోని తోటపల్లి, సుంకి, సంతోషపురం పంచాయతీలను పరిశీలిం చారు.
గరుగుబిల్లి: గ్రామాల్లో వ్యాధులు విజృంభించకుండా అప్రమత్తంగా ఉండా లని ఎంపీడీవో పి.పైడితల్లి, ఈవోపీఆర్డీ ఎల్.గోపాలరావు సూచించారు. బుధవా రం మండలంలోని తోటపల్లి, సుంకి, సంతోషపురం పంచాయతీలను పరిశీలిం చారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టుకు ఆనుకుని పలుగ్రామా ల్లో కలుషిత నీరు ఉపయోగించకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పరిసరాలు పరిశుభ్రతగా ఉండేలా కార్యదర్శులు ప్రత్యేక చొరవ చూపాలని కోరా రు. వైరల్ జ్వరాలు ఉంటే తక్షణమే వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. జ్వరా లపై ఇంటింటి సర్వే నిర్వహించి వివరాలు అందించాలని కోరారు. దోమలు విజృంభించకుండా ఉండేలా క్లోరినేషన్ చర్యలు చేపట్టాలని తెలిపారు. కార్యక్ర మంలో సర్పంచ్‌లు ఎ.సింహాచలమమ్మ, రామకృష్ణ, ఎ.తవిటి నాయుడు, కె.రవీం ద్ర, కార్యదర్శులు ఎస్.శ్రీనివాసరావు పాల్గొన్నారు.