డీఈఐసీతో పిల్లలకు చక్కని భవిష్యత్తు
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:29 AM
జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రం(డీఈఐసీ) ద్వారా పిల్లలకు ఆరోగ్యవంతమైన భవిష్యత్తు ఉంటుం దని డిప్యూటీ డీఎంహెచ్‌వో టి.జగన్మోహన్‌రావు అన్నారు.
బెలగాం: జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రం(డీఈఐసీ) ద్వారా పిల్లలకు ఆరోగ్యవంతమైన భవిష్యత్తు ఉంటుం దని డిప్యూటీ డీఎంహెచ్‌వో టి.జగన్మోహన్‌రావు అన్నారు. స్థానికంగా ఉన్న జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రాన్ని ఆయన ఆర్బీఎస్‌కే జల్లా సమన్వయ అధికారి పీఎల్.రఘుకుమార్‌తో బుఽధవారం సందర్శించారు. ప్రతి నెలా డీఈఐసీ కేంద్రంలో ఎదుగుదల లోపం, వైకల్యం, తదితర సమస్యలతో నమోదు అవుతున్న పిల్లల వివరాలు, వారికి అందజేస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శస్త్ర చికిత్సలు అవసరమైన బాలలకు డీఈఐసీ సెంటర్ ద్వారా ఉన్నత ఆసుపత్రిల్లో ఆపరేషన్లు చేయించి వారి లోపాన్ని సవరిస్తారని తెలిపారు. పుట్టిన వెంటనే పిల్లల్లో ఏమైనా లోపాలు ఉంటే గమనించి డీఈఐసీ ద్వారా చికిత్స అందించి సవరణ చేస్తారని చెప్పారు.