Share News

నర్సీపట్నంలో వాటర్‌ స్పోర్ట్స్ట్‌

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:50 AM

స్తానిక పెద్ద చెరువుని వాటర్‌ స్పోర్ట్స్‌కి ఉపయోగించుకోవడానికి ప్రణాళిక రూపకల్పన జరుగుతున్నది. పెద్ద చెరువుని ట్యాంక్‌ బండ్‌గా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ స్టేట్‌ వాటర్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బలరామ్‌ నాయుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌, ఇరిగేషన్‌ ఏఈ, ఆర్‌అండ్‌బీ అధికారులు, మునిసిపల్‌ కమిషనర్‌ శుక్రవారం ఇక్కడ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుని కలిశారు.

నర్సీపట్నంలో వాటర్‌ స్పోర్ట్స్ట్‌
నర్సీపట్నం పెద్ద చెరువులో వాటర్‌ స్పోర్ట్స్‌ గురించి స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుకి వివరిస్తున్న బలరామ్‌నాయుడు

పెద్ద చెరువులో ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రణాళిక

స్పీకర్‌ను కలిసి వాటర్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు

సానుకూలంగా స్పందించిన అయ్యన్నపాత్రుడు

త్వరితగతిన డీపీఆర్‌ సిద్ధం చేయాలని ఆదేశం

నర్సీపట్నం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): స్తానిక పెద్ద చెరువుని వాటర్‌ స్పోర్ట్స్‌కి ఉపయోగించుకోవడానికి ప్రణాళిక రూపకల్పన జరుగుతున్నది. పెద్ద చెరువుని ట్యాంక్‌ బండ్‌గా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ స్టేట్‌ వాటర్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బలరామ్‌ నాయుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌, ఇరిగేషన్‌ ఏఈ, ఆర్‌అండ్‌బీ అధికారులు, మునిసిపల్‌ కమిషనర్‌ శుక్రవారం ఇక్కడ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుని కలిశారు. పెద్ద చెరువులో వాటర్‌ స్పోర్ట్స్‌లో బోట్‌ రేసింగ్‌పై శిక్షణ ఇస్తే బాగుంటుందని బలరామ్‌నాయుడు ప్రతిపాదించారు. ప్రైవేటు భాగస్వామ్యంతో వాటర్‌ స్పోర్ట్స్‌లో డ్రాగన్‌ బోట్‌ రేసింగ్‌, పెడలింగ్‌ బోట్స్‌, కయాకింగ్‌, డైవింగ్‌, కానోయింగ్‌లో శిక్షణ ఇవ్వొచ్చని ఆయన తెలిపారు. రాష్ట్ర, జాతీయస్థాయి జల క్రీడల పోటీల్లో పాల్గొనేలా యువతకు ఇక్కడ తర్ఫీదు పొందవచ్చని చెప్పారు. అడ్వంచర్‌ జోన్‌ కూడా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని సూచించారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో షెడ్లు వేసి చిన్నపాటి దుకాణాలను ఏర్పాటు చేసుకోవచ్చునని అన్నారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, పెద్ద చెరువులో ఏడాది పొడవునా నీరు వుంటుందని, వాటర్‌ స్పోర్ట్స్‌కు ఇబ్బంది వుండదని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పరంగా సహాయ, సహకారాలు అందిస్తామని, త్వరితగతిన డీపీఆర్‌ సిద్ధం చేయాలని అన్నారు. అనంతరం బలరామ్‌ నాయుడు ఇరిగేషన్‌ ఏఈ రామన్నపాత్రుడు, మునిసిపల్‌ కమిషనర్‌ సురేంద్రతో కలిసి పెద్ద చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు.

Updated Date - Nov 30 , 2024 | 12:51 AM