Share News

ఇద్దరు డీఎస్పీలు బదిలీ

ABN , Publish Date - Sep 16 , 2024 | 01:25 AM

అనకాపల్లి జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు డీఎస్పీలు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 47 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇద్దరు డీఎస్పీలు బదిలీ

అనకాపల్లి టౌన్‌, సెప్టెంబరు 15 :

అనకాపల్లి జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు డీఎస్పీలు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 47 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అనకాపల్లి మహిళా పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీగా పనిచేస్తున్న ఎం.ఉపేంద్రబాబును కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు డీఎస్పీగా బదిలీ చేశారు. అనకాపల్లి డీటీసీ డీఎస్పీగా పనిచేస్తున్న ఎం.శ్రీనివాసరావును విజయనగరం డీఎస్పీగా బదిలీ చేశారు. ఈ రెండు స్థానాల్లోకి ఇంకా ఎవరినీ నియమించలేదు.

Updated Date - Sep 16 , 2024 | 01:25 AM