Share News

అందరూ అడిగారనే అధ్యయన యాత్రకు...

ABN , Publish Date - Oct 20 , 2024 | 01:28 AM

చట్టం గురించి పక్కనపెడితే గత కొన్నేళ్లుగా అధ్యయన యాత్రకు వెళ్లడం సంప్రదాయంగా వస్తోంది.

అందరూ అడిగారనే అధ్యయన యాత్రకు...

జీవీఎంసీ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి

ప్రశ్న: కార్పొరేటర్ల అధ్యయన యాత్రకు చట్టంలో అనుమతి ఉందా?

మేయర్‌: చట్టం గురించి పక్కనపెడితే గత కొన్నేళ్లుగా అధ్యయన యాత్రకు వెళ్లడం సంప్రదాయంగా వస్తోంది. గతంలో రెండుసార్లు వెళ్లారు. ఇప్పుడు మరోసారి వెళుతున్నారు.

ప్రశ్న: చట్టంలో లేనప్పుడు జీవీఎంసీ నిధులతో యాత్రకు ఎందుకు అనుమతి ఇచ్చారు?

మేయర్‌: అధ్యయన యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైసీపీ, టీడీపీ, జనసేన ఫ్లోర్‌లీడర్లు నాకు లేఖలు ఇచ్చారు. కమిషనర్‌ కూడా యాత్రకు అనుమతి ఇవ్వాలని లేఖ ద్వారా కోరారు. అందరి అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న తర్వాతే అనుమతిచ్చాను.

ప్రశ్న: మీరు మేయర్‌గా ఉన్నకాలంలో జరిగిన రెండు అధ్యయన యాత్రల్లో గుర్తించి నగరంలో అమలుచేసిన మంచి ప్రాజెక్టులు ఒకటైనా ఉందా?

మేయర్‌: ఇప్పటివరకూ జరిగిన రెండు అధ్యయన యాత్రలు ఉత్తర భారతదేశంలోని పలు కార్పొరేషన్లలో జరిగాయి. ఆగ్రా, జమ్మూలో చెత్త శాస్త్రీయ నిర్వహణ విధానం బాగుందని గుర్తించాం. కానీ వేర్వేరు కారణాల వల్ల వాటిని నగరంలో ఇంతవరకూ అమలుచేయడం సాధ్యపడలేదు.

ప్రశ్న: అధ్యయన యాత్ర పేరుతో బలవంతపు వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలపై మీ స్పందన?

మేయర్‌: ప్రతి కార్పొరేటర్‌కు జీవీఎంసీ నిధుల నుంచి రూ.1.19 లక్షలు వెచ్చించేందుకు టెండర్‌ పిలిచాం. అదనపు సూళ్లకు పాల్పడాల్సిన అవసరం లేదు.

Updated Date - Oct 20 , 2024 | 01:28 AM