Share News

పొంగిన ఉప్పుటేరు

ABN , Publish Date - Sep 16 , 2024 | 01:26 AM

మండలంలోని అమలాపురం గ్రామానికి చెందిన మత్స్యకారులు, గ్రామస్తులు సముద్రం ద్గగరకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి.

పొంగిన ఉప్పుటేరు

నీట మునిగిన అమలాపురం బీచ్‌ రోడ్డు

రాకపోకలకు మత్స్యకారుల ఇబ్బందులు

నక్కపల్లి, సెప్టెంబరు 15:

మండలంలోని అమలాపురం గ్రామానికి చెందిన మత్స్యకారులు, గ్రామస్తులు సముద్రం ద్గగరకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి.

ఇటీవల కురిసిన వర్షాలతో ఉప్పుటేరులోకి భారీగా నీరు చేరింది. దీంతో అమలాపురం గ్రామం నుంచి ఉప్పుటేరు మీదుగా సముద్ర తీరానికి వెళ్లే రహదారి మునిగిపోయింది. వరద ప్రవాహంతో రహదారి దెబ్బతిన్నది. దీంతో అమలాపురం, మూలపర్ర గ్రామాల మత్స్యకారులు, ఇతరులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. ద్వీచక్ర వాహనాలపైనా వెళ్లడానికి వీలు కావడంలేదు.

Updated Date - Sep 16 , 2024 | 01:26 AM