Share News

AP News: సీఎం జగన్ కోసం ప్రత్యేక హెలికాఫ్టర్... విశాఖవాసుల ఆగ్రహం..!

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:31 PM

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ ‘‘ఆడుదాం ఆంధ్ర’’ బహుమతి ప్రధానోత్సవానికి సీఎం జగన్ హాజరుకానున్నారు. అయితే సీఎం వచ్చేందుకు చేసిన ఏర్పాట్లు విశాఖ నగర వాసులు ఆగ్రహానానికి కారణంగా నిలిచింది.

AP News: సీఎం జగన్ కోసం ప్రత్యేక హెలికాఫ్టర్... విశాఖవాసుల ఆగ్రహం..!

విశాఖపట్నం, ఫిబ్రవరి 13: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ ‘‘ఆడుదాం ఆంధ్ర’’ బహుమతి ప్రధానోత్సవానికి సీఎం జగన్ హాజరుకానున్నారు. అయితే సీఎం వచ్చేందుకు చేసిన ఏర్పాట్లు ఇప్పుడు విశాఖ నగర వాసులు ఆగ్రహానానికి కారణంగా నిలిచాయి. సీఎం జగన్ విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ఐటీ హిల్‌కు వచ్చేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక హెలిక్టాఫ్టర్‌ను ఏర్పాటు చేసింది. తిరిగి రాత్రికి రోడ్డు మార్గంగుండా ముఖ్యమంత్రి వెళ్లనున్నారు.

అయితే... పేద ముఖ్యమంత్రి అంటూ గొప్పలు చెబుతూ ఐటీ హిల్‌కు ప్రత్యేక హెలికాప్టర్‌ను ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందంటూ విశాఖవాసులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి కోసం స్టేడియం ముందు ఉన్న రోడ్డు డివైడర్‌ను అధికారులు కట్ చేశారు. దీంతో క్రీడా సంబరాన్ని జగన్ మోహన్‌రెడ్డి రాజకీయానికి వాడుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. 1000 నుంచి 1500 మంది మంది క్రీడాకారులకు బహుమతులు ఇవ్వడం కోసం వేల సంఖ్యలో జన సమీకరణకు వైసీపీ యత్నిస్తోంది. కార్యకర్తలు, డ్వాక్రా మహిళలతో గ్యాలరీలు నింపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు సరైన వసతులు లేక, నిర్వహణ లేక అనేక మంది క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బయట వ్యక్తులతో క్రీడలు ఆడించడం పట్ల పలు జట్లు ఆగ్రహం, ఆందోళనకు దిగాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు వారికి సర్దిచెప్పి మరీ నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 13 , 2024 | 12:32 PM