Share News

ప్రతి శుక్రవారం విద్యుత్‌ లైన్ల నిర్వహణ

ABN , Publish Date - Sep 16 , 2024 | 01:19 AM

తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌)లో ప్రతి శుక్రవారం విద్యుత్‌ లైన్ల నిర్వహణ పనులు చేపట్టాలనే నిబంధన అమలుచేస్తున్నామని సీఎండీ పృథ్వీతేజ్‌ తెలిపారు. ప్రతి శుక్రవారం విద్యుత్‌ లైన్ల నిర్వహణ ఏ సమస్య ఉన్నా 1912కు కాల్‌ చేస్తే చాలు పీఎం జన్‌మన్‌లో ఆదివాసీలకు విద్యుత్‌ సరఫరా ‘ఆంధ్రజ్యోతి’తో ఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ్‌ (విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌)లో ప్రతి శుక్రవారం విద్యుత్‌ లైన్ల నిర్వహణ పనులు చేపట్టాలనే నిబంధన అమలుచేస్తున్నామని సీఎండీ పృథ్వీతేజ్‌ తెలిపారు. ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ గతంలో వేసవి సీజన్‌కు ముందు ఈ నిర్వహణ పనులు జరిగేవన్నారు. అయితే ఏడాది మొత్తం వదిలేసి, సీజన్‌లోనే చేయడం వల్ల సమస్యలు వస్తున్నాయని గుర్తించి, ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు చేపట్టాలని ఆదేశించామన్నారు. ఎక్కడైనా చెట్ల కొమ్మలు విద్యుత్‌ లైన్‌పై పడితే వెంటనే ట్రిప్‌ అయి సరఫరా నిలిచిపోతోందని, దీనిని సరిచేయడానికి గంటల సమయం పడుతోందన్నారు. ఇప్పుడు విద్యుత్‌ సరఫరా పది నిమిషాలు ఆగినా భరించలేని స్థితిలో వినియోగదారులు ఉన్నందున అసలు ఆ సమస్యే రాకుండా ముందుజాగ్రత్తగా ఇలా ప్రతి శుక్రవారం నిర్వహణ పనులు చేయిస్తున్నామన్నారు. దీనివల్ల ట్రిప్‌ సమస్యతో విద్యుత్‌ ఆగిపోయే ఘటనలు తగ్గుతున్నాయన్నారు. డిస్కమ్‌లోని అన్ని సర్కిళ్లలోను దీనిని అమలుచేస్తున్నామన్నారు. 150 ప్రాంతాల్లో పీఎం జన్‌మన్‌ ప్రతి ఇంటికీ విద్యుత్‌ సరఫరా ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా కొండల్లో నివసించే కొన్ని గిరిజన గ్రామాలకు విద్యుత్‌ లైన్లు వేయలేని పరిస్థితి ఉందన్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు కొండలపై నివాసాలను మార్చుకునే ఆదిమ జాతి గిరిజనులకు విద్యుత్‌ వెలుగులు అందించేందుకు పీఎం జన్‌మన్‌ పథకం అమలుచేస్తుండగా, అందులో సుమారు 150 మంది గిరిజన కుటుంబాలకు సోలార్‌తో పనిచేసే విద్యుత్‌ బల్బులు, ఫ్యాన్‌, చార్జింగ్‌ పాయింట్‌ వంటివి అందించామన్నారు. ఇవన్నీ ఒక ప్యాకేజీ కింద ఉంటాయని, ఒక్కొక్కటి రూ.50 వేలు విలువ చేస్తుందన్నారు. కేవలం సూర్యకాంతితోనే ఇవి పనిచేస్తాయన్నారు. సేవల్లో లోపం లేకుండా చూస్తున్నాం డిస్కమ్‌లో ఉండాల్సిన సిబ్బందిలో మూడో వంతు కొరత ఉందని, అయినా ఎక్కడా సేవలకు లోపం లేకుండా పనులు చేయిస్తున్నామని చెప్పారు. ఎటువంటి ఫిర్యాదులున్నా గృహ వినియోగదారులైతే ఆరు గంటల సమయంలోనే దానిని పరిష్కరిస్తున్నామన్నారు. విద్యుత్‌ వినియోగదారులు వారికి ఏ సమస్య ఉన్నా 1912 నంబరుకు కాల్‌ చేస్తే ఫిర్యాదు స్వీకరిస్తారని, దాని పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారని, ఫిర్యాదులను ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షిస్తుంటారని సీఎండీ పృథ్వీతేజ్‌ తెలిపారు. అధికారులనే సంప్రతించండి విద్యుత్‌కు సంబంఽదించి ఎటువంటి పనులు ఉన్నా స్థానికంగా ఉండే ఏఈ కార్యాలయంలో సంప్రతించాలని, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో వారే సూచిస్తారని సీఎండీ వివరించారు. విద్యుత్‌ పనులు చేయిస్తామని దళారులు చాలామంది వెంటపడతారని, వారిని నమ్మవద్దని సూచించారు. అలా చేస్తే కాలయాపనతో పాటు ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందన్నారు.

ప్రతి శుక్రవారం విద్యుత్‌ లైన్ల నిర్వహణ

ఏ సమస్య ఉన్నా 1912కు కాల్‌ చేస్తే చాలు

పీఎం జన్‌మన్‌లో ఆదివాసీలకు విద్యుత్‌ సరఫరా

‘ఆంధ్రజ్యోతి’తో ఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌)లో ప్రతి శుక్రవారం విద్యుత్‌ లైన్ల నిర్వహణ పనులు చేపట్టాలనే నిబంధన అమలుచేస్తున్నామని సీఎండీ పృథ్వీతేజ్‌ తెలిపారు. ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ గతంలో వేసవి సీజన్‌కు ముందు ఈ నిర్వహణ పనులు జరిగేవన్నారు. అయితే ఏడాది మొత్తం వదిలేసి, సీజన్‌లోనే చేయడం వల్ల సమస్యలు వస్తున్నాయని గుర్తించి, ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు చేపట్టాలని ఆదేశించామన్నారు.

ఎక్కడైనా చెట్ల కొమ్మలు విద్యుత్‌ లైన్‌పై పడితే వెంటనే ట్రిప్‌ అయి సరఫరా నిలిచిపోతోందని, దీనిని సరిచేయడానికి గంటల సమయం పడుతోందన్నారు. ఇప్పుడు విద్యుత్‌ సరఫరా పది నిమిషాలు ఆగినా భరించలేని స్థితిలో వినియోగదారులు ఉన్నందున అసలు ఆ సమస్యే రాకుండా ముందుజాగ్రత్తగా ఇలా ప్రతి శుక్రవారం నిర్వహణ పనులు చేయిస్తున్నామన్నారు. దీనివల్ల ట్రిప్‌ సమస్యతో విద్యుత్‌ ఆగిపోయే ఘటనలు తగ్గుతున్నాయన్నారు. డిస్కమ్‌లోని అన్ని సర్కిళ్లలోను దీనిని అమలుచేస్తున్నామన్నారు.

150 ప్రాంతాల్లో పీఎం జన్‌మన్‌

ప్రతి ఇంటికీ విద్యుత్‌ సరఫరా ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా కొండల్లో నివసించే కొన్ని గిరిజన గ్రామాలకు విద్యుత్‌ లైన్లు వేయలేని పరిస్థితి ఉందన్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు కొండలపై నివాసాలను మార్చుకునే ఆదిమ జాతి గిరిజనులకు విద్యుత్‌ వెలుగులు అందించేందుకు పీఎం జన్‌మన్‌ పథకం అమలుచేస్తుండగా, అందులో సుమారు 150 మంది గిరిజన కుటుంబాలకు సోలార్‌తో పనిచేసే విద్యుత్‌ బల్బులు, ఫ్యాన్‌, చార్జింగ్‌ పాయింట్‌ వంటివి అందించామన్నారు. ఇవన్నీ ఒక ప్యాకేజీ కింద ఉంటాయని, ఒక్కొక్కటి రూ.50 వేలు విలువ చేస్తుందన్నారు. కేవలం సూర్యకాంతితోనే ఇవి పనిచేస్తాయన్నారు.

సేవల్లో లోపం లేకుండా చూస్తున్నాం

డిస్కమ్‌లో ఉండాల్సిన సిబ్బందిలో మూడో వంతు కొరత ఉందని, అయినా ఎక్కడా సేవలకు లోపం లేకుండా పనులు చేయిస్తున్నామని చెప్పారు. ఎటువంటి ఫిర్యాదులున్నా గృహ వినియోగదారులైతే ఆరు గంటల సమయంలోనే దానిని పరిష్కరిస్తున్నామన్నారు. విద్యుత్‌ వినియోగదారులు వారికి ఏ సమస్య ఉన్నా 1912 నంబరుకు కాల్‌ చేస్తే ఫిర్యాదు స్వీకరిస్తారని, దాని పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారని, ఫిర్యాదులను ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షిస్తుంటారని సీఎండీ పృథ్వీతేజ్‌ తెలిపారు.

అధికారులనే సంప్రతించండి

విద్యుత్‌కు సంబంఽదించి ఎటువంటి పనులు ఉన్నా స్థానికంగా ఉండే ఏఈ కార్యాలయంలో సంప్రతించాలని, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో వారే సూచిస్తారని సీఎండీ వివరించారు. విద్యుత్‌ పనులు చేయిస్తామని దళారులు చాలామంది వెంటపడతారని, వారిని నమ్మవద్దని సూచించారు. అలా చేస్తే కాలయాపనతో పాటు ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 01:19 AM