వరద బాధితులకు లారస్ ల్యాబ్స్ రూ.కోటి అందజేత
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:41 AM
విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఫార్మాసిటీలోని లారస్ ల్యాబ్స్ యాజమాన్యం కోటి రూపాయలు సమకూర్చింది.
పరవాడ , సెప్టెంబరు 15 : విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఫార్మాసిటీలోని లారస్ ల్యాబ్స్ యాజమాన్యం కోటి రూపాయలు సమకూర్చింది. ఇందుకు సంబంధించిన చెక్కును లారస్ ల్యాబ్స్ సీఈవో చావా సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చావా నాగరాణి కలిసి ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందజేసినట్టు లారస్ ల్యాబ్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (హెచ్‌ఆర్ విభాగం) బోడేపూడి రామకృష్ణ తెలిపారు. వరదల వల్ల నష్టపోయిన వారికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి తమ వంతు సాయం అందజేయాలని ఈ సందర్భంగా రామకృష్ణ పిలుపునిచ్చారు.