Share News

భారీ వర్షం

ABN , Publish Date - Oct 20 , 2024 | 10:42 PM

మండల పరిధిలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించింది. మధ్యాహ్నం 2 గంటల తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

భారీ వర్షం
ముంచంగిపుట్టులో వర్షం

ముంచంగిపుట్టు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించింది. మధ్యాహ్నం 2 గంటల తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో ఏకధాటిగా వర్షం కురిసింది. స్థానిక నాలుగు రోడ్లపై, ఇళ్ల ముందు నుంచి వర్షపు నీరు ప్రవహించింది. పలు చోట్ల వాగులు, మత్స్యగెడ్డ పాయలు వరద నీటితో ఉధృతంగా ప్రవహించాయి. మండల కేంద్రం నుంచి జోలాపుట్టు, సంగడ, కుమడ, పెదబయలు తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారుల గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోయి చెరువులను తలపించాయి. మట్టిరోడ్లు బురదమయంగా మారాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

మద్దిగరువులో...

జి.మాడుగుల: మండలంలోని మద్దిగరువు ప్రాంతంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మఽధ్యాహ్నం వరకు ఎండ కాయగా, సాయంత్రం ఒక్కసారిగి వాతావరణం మారిపోయి భారీ వర్షం కురవడంతో జనజీవనానికి అంతరాయం కలిగింది.

Updated Date - Oct 20 , 2024 | 10:42 PM