Share News

పూడిమడక మత్స్యకారులు హ్యాపీ!

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:34 AM

సుమారు వారం రోజుల తరువాత సముద్రంలో వేటకు వెళుతున్న పూడిమడక మత్స్యకారులకు భారీగానే చేపలు లభిస్తున్నాయి. గ్రామంలో సుమారు 700 బోట్లుండగా మంగళవారం ఉదయం సుమారు 300 బోట్లు చేపల వేటకు వెళ్లాయి.

పూడిమడక మత్స్యకారులు హ్యాపీ!
మత్స్యకారులు విక్రయిస్తున్న అభిలాష రకం చేపలు

గేలాలకు చిక్కిన కచ్చిలి చేపలు

అచ్యుతాపురం, అక్టోబరు 1: సుమారు వారం రోజుల తరువాత సముద్రంలో వేటకు వెళుతున్న పూడిమడక మత్స్యకారులకు భారీగానే చేపలు లభిస్తున్నాయి. గ్రామంలో సుమారు 700 బోట్లుండగా మంగళవారం ఉదయం సుమారు 300 బోట్లు చేపల వేటకు వెళ్లాయి. అన్ని గేలాలకు ‘అభిలాష’ అనే చేపలతోపాటు కచ్చిలి చేపలు కూడా చిక్కాయి. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా సెప్టెంబరు 21 నుంచి పూడిమడక మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లడంలేదు. వర్షాలు ఆగిపోవడం, వాతావరణం అనుకూలంగా మారడంతో ఆదివారం నుంచి చేపల వేటకు వెళుతున్నారు. రెండు రోజుపాటు ఆశాజనంగా వేట సాగలేదు. చిన్నపాటి చేపలు పడడంతో నిరాశ చెందారు. అయితే మంగళవారం వేటకు వెళ్లిన అన్ని బోట్లకు చేపలు పడ్డాయి. అందరికీ ‘అభిలాష’ రకం చేపలు పడడం విశేషం. ఒక్కొక్క బోటుకు పది చేవలు వరకు చిక్కాయి. వ్యాపారులు కిలో వంద రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. ఒక మత్స్యకారుని గేలాలకు నాలుగు కచ్చిలి/బంగారు పాప చేపలు పడ్డాయి. వ్యాపారులు వీటిని రూ.30 వేలకు కొనుగోలు చేశారు.

Updated Date - Oct 02 , 2024 | 07:53 AM