ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైసీపీ జిల్లా అధ్యక్షునిగా గుడివాడ అమర్‌నాథ్‌

ABN, Publish Date - Sep 27 , 2024 | 01:31 AM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను నియమిస్తూ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.

విశాఖపట్నం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి):

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను నియమిస్తూ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో అమర్‌నాథ్‌ గాజువాక నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవిపై అమర్‌ ఆశలు పెట్టుకోగా, అధిష్ఠానం అనూహ్యంగా విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని అమర్‌నాథ్‌ కొంతకాలంగా అధిష్ఠానాన్ని కోరుతున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అమర్‌ను నియమించినట్టు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

‘పశ్చిమ’ సమన్వయకర్తగా మళ్ల

పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్‌పసాద్‌ను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం సమన్వయకర్తగా పనిచేస్తున్న ఆడారి ఆనంద్‌కుమార్‌ సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో గతంలో ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేసిన మళ్ల విజయ్‌ప్రసాద్‌ను తిరిగి సమన్వయకర్తగా నియమించారు.

Updated Date - Sep 27 , 2024 | 01:31 AM