మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందకు ఘన సత్కారం
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:04 AM
రాష్ట్ర అర్భన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణను టీడీపీ కార్యకర్తలు మంగళవారం పార్టీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.
తుమ్మపాల, అక్టోబరు 1 : రాష్ట్ర అర్భన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణను టీడీపీ కార్యకర్తలు మంగళవారం పార్టీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. దుశ్శాలువాలను కప్పి బుద్దుని చిత్రపటాన్ని అందించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ కష్టపడి పార్టీలో పనిచేసిన వారికి పార్టీ నిత్యం అండగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో కార్యకర్తలంతా క్రమశిక్షణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.