చెక్కపై గాంధీజీ రూపం
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:35 AM
మండలంలోని చినదొడ్డిగొల్లు గ్రామానికి చెందిన సూక్ష్మకళాకారుడు దార్ల రవి ప్రత్యేక సందర్భాల్లో తన కళా నైపుణ్యతను ప్రదర్శించి అద్భుత కళాఖండాలను తయారు చేస్తున్నాడు.
నక్కపల్లి, అక్డోబరు 1: మండలంలోని చినదొడ్డిగొల్లు గ్రామానికి చెందిన సూక్ష్మకళాకారుడు దార్ల రవి ప్రత్యేక సందర్భాల్లో తన కళా నైపుణ్యతను ప్రదర్శించి అద్భుత కళాఖండాలను తయారు చేస్తున్నాడు. తాజాగా అక్టోబరు రెండో తేదీ గాంధీ జయంతి సందర్భంగా చెక్కపై గాంధీజీ రూపంతోపాటు రెండో తేదీని అంకె రూపంలో చక్కగా చెక్కాడు.