Share News

పండుగలా పింఛన్ల పంపిణీ

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:03 AM

పట్టణంలో మంగళవారం పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరిగింది.

పండుగలా పింఛన్ల పంపిణీ
అనకాపల్లి టౌన్‌: పింఛన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కూటమి నాయకులు

అనకాపల్లి టౌన్‌, అక్టోబరు 1 : పట్టణంలో మంగళవారం పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరిగింది. తెల్లవారుజామునే సచివాలయ ఉద్యోగులు వారి పరిధిలో పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. స్థానిక భీమునిగుమ్మం, మళ్లవీధి ప్రాంతాల్లో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, అర్భన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అలాగే పట్టణంలోని ఐదు వార్డుల్లో కూడా కూటమి నాయకులు పింఛన్లు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు డాక్టర్‌ కేకేవీఏ నారాయణరావు, సబ్బవరపు గణేష్‌, బొద్దపు ప్రసాద్‌, కాయల ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని 9,907 మంది లబ్ధిదారులు ఉండగా 9,661 మందికి పింఛన్లు పంపిణీ చేశారు.

ఎలమంచిలిలో..

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పెంపుతో పేదల జీవితాల్లో వెలుగులు నింపినట్టయిందని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ అన్నారు. మంగళవారం మునిసిపాలిటీ కాకివానివీధిలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వమని నిరూపితమైందన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ ప్రసాదరాజు, కూటమి నేతలు బొద్దపు శ్రీను, గొర్లె నానాజీ, కొఠారు సాంబ, రాజాన శేషు, కొఠారు నరేష్‌, మజ్జి రామకృష్ణ, కొనగళ్ల రామకృష్ణ, వై. చిరంజీవి, ఆడారి రమణబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అచ్యుతాపురం రూరల్‌లో..

ప్రభుత్వం అందజేస్తున్న పెన్షన్‌ ద్వారా అనేక మంది జీవితాలకు భద్రత చేకూరుతుందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని కొండకర్ల, చీమలాపల్లి గ్రామాల్లో ఆయన పెన్షన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుడివాడ జయకుమార్‌, మామిడి శివ అప్పారావు, శ్యామల రాజు, దాసరి నర్సింగరావు, కట్టుమూరి చిట్టేశ్వరరావు, కోసూరి ఈశ్వరరావు, పెయ్యిల గిరి తదితరులు పాల్గొన్నారు.

రాంబిల్లిలో..

మండలంలో పలు గ్రామాల్లో లబ్ధిదారులకు కూటమి నేతలు ఉదయం 6 గంటల నుంచి పింఛన్లను మంగళవారం పంపిణీ చేశారు. కృష్ణంపాలెంలో టీడీపీ మండల అధ్యక్షుడు వి.దిన్‌బాబు, టీడీపీ నాయకుడు కశిరెడ్డి ప్రసాద్‌, కొత్తపట్నం, గోవిందపాలెం, కొత్తపేట గ్రామాల్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ధూళి రంగనాయకులు, జనసేన మండల అధ్యక్షుడు పప్పల నూకన్నదొర లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

Updated Date - Oct 02 , 2024 | 12:03 AM