పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:42 AM
మండలంలోని కొత్తవలస- కిరండూల్ రైల్వేలైన్ చీమిడిపల్లి రైల్వేస్టేషన్ యార్డులో సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
రైల్వే సిబ్బంది యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు
యథావిధిగా రైళ్ల రాకపోకలు
అనంతగిరి, అక్టోబర్ 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్తవలస- కిరండూల్ రైల్వేలైన్ చీమిడిపల్లి రైల్వేస్టేషన్ యార్డులో సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విశాఖపట్నం నుంచి కిరండూల్ వెళుతున్న ఈ రైలు చీమిడిపల్లి రైల్వేస్టేషన్ యార్డులోకి వచ్చేసరికి నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. వెంటనే రైల్వే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. మధ్యాహ్నం నుంచి కేకే లైన్‌లో యథావిధిగా రైళ్ల రాకపోకలు సాగాయి.