సీఎం ఆదేశంతో దశాబ్దాల నాటి సమస్య పరిష్కారం
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:41 AM
మంప పంచాయతీలోని నాలుగు గ్రామాల ప్రజల రేషన్ కష్టాలు ఎట్టకేలకు గట్టెక్కాయి. ఆయా గ్రామాల ప్రజల కష్టాలను సీపీఐ నాయకులు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి సబ్ డిపో ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ నాలుగు గ్రామాలకు అందుబాటులో ఉండేలా ఆర్.దొడ్డవరంలో మంగళవారం సబ్ డిపోను అధికారులు ఏర్పాటు చేశారు. దీనిపై ఆ గ్రామాల ప్రజలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
- మంప పంచాయతీలోని నాలుగు గ్రామాల ప్రజలకు రేషన్ కష్టాలు
- ప్రతి నెలా నడక దారిన 12 కిలో మీటర్లు, లేదా రోడ్డు మార్గాన 50 కిలో మీటర్లు ప్రయాణించాల్సిన దుస్థితి
- అందుబాటులో సబ్ డిపో ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా ఫలితం శూన్యం
- ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లిన సీపీఐ నాయకులు
- వెంటనే స్పందించి ఒక్క రోజులోనే సబ్ డిపో ఏర్పాటు చేయించిన వైనం
- హర్షం వ్యక్తం చేస్తున్న గిరిజనులు
కొయ్యూరు, అక్టోబరు 1: మంప పంచాయతీలోని నాలుగు గ్రామాల ప్రజల రేషన్ కష్టాలు ఎట్టకేలకు గట్టెక్కాయి. ఆయా గ్రామాల ప్రజల కష్టాలను సీపీఐ నాయకులు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి సబ్ డిపో ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ నాలుగు గ్రామాలకు అందుబాటులో ఉండేలా ఆర్.దొడ్డవరంలో మంగళవారం సబ్ డిపోను అధికారులు ఏర్పాటు చేశారు. దీనిపై ఆ గ్రామాల ప్రజలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
మంప పంచాయతీలోని పి.గంగవరం, టిటోరాళ్లు, ఆర్.దొడ్డవరం, గొడుగులమ్మబంధ గ్రామాల్లో వంద కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలు ప్రతి నెలా నడక దారిన 12 కిలోమీటర్లు, లేదా రోడ్డు మార్గాన యాభై కిలోమీటర్లు ప్రయాణించి డిపో ఉన్న మంప వచ్చి రేషన్ సరకులు తీసుకువెళ్లేవారు. తమ గ్రామాలకు అందుబాటులో సబ్ డిపోను ఏర్పాటు చేయాలని పలు మార్లు ఉన్నతాధికారులకు వారు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోయింది. కాగా సోమవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును సీపీఐ అగ్ర నేతలు రామకృష్ణ, జేవీ సత్యనారాయణమూర్తి, పార్టీ జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంప పంచాయతీలోని ఆ నాలుగు గ్రామాల ప్రజలు రేషన్ సరకుల కోసం పడుతున్న ఇబ్బందులను పొట్టిక సత్యనారాయణ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి ఆ నాలుగు గ్రామాలకు అందుబాటులో ఉండేలా సబ్ డిపో ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో ఆర్.దొడ్డవరంలో మంగళవారం సబ్ డిపోను అధికారులు ప్రారంభించారు. దశాబ్దాల కాలంగా ఉన్న డిపో సమస్య తీరడంతో గిరిజనులు ముఖ్యమంత్రికి ఽకృతజ్ఞతలు తెలిపారు.