బొగ్గు లారీ బోల్తా
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:27 AM
మండలంలోని వెంకన్నపాలెం వద్ద బొగ్గు లారీ బోల్తా పడింది. ప్రస్తుతం వెంకన్నపాలెం వద్ద రోడ్డు మరమ్మతులు చేపడుతున్నారు.
మాకవరపాలెం, సెప్టెంబరు 11 : మండలంలోని వెంకన్నపాలెం వద్ద బొగ్గు లారీ బోల్తా పడింది. ప్రస్తుతం వెంకన్నపాలెం వద్ద రోడ్డు మరమ్మతులు చేపడుతున్నారు. ఈ క్రమంలో మండలంలో ఉన్న అల్యూమినియం కంపెనీకి బుధవారం ఉదయం విశాఖపట్నం నుంచి వస్తున్న బొగ్గు లారీ అక్కడకు వచ్చేసరికి అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న బొగ్గు పక్కనే ఉన్న మామిడి తోటలో ఒరిగిపోయింది. లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ దామోదర్ నాయుడు తెలిపారు.