జాతీయ రైఫిల్ షూటింగ్ పోటీలకు చోడవరం యువకుడి ఎంపిక
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:48 AM
రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో పట్టణానికి చెందిన నల్లమిల్లి సుందరరామారెడ్డి రజత పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
చోడవరం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో పట్టణానికి చెందిన నల్లమిల్లి సుందరరామారెడ్డి రజత పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. రాజమండ్రిలో ఆదివారం నిర్వహించిన 68వ రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో రామారెడ్డి 200 పాయింట్లకు గాను 187 పాయింట్లు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈ ప్రతిభతో డిసెంబరు నెలలో ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. పట్టణానికి చెందిన వ్యాపారి గనిరెడ్డి కుమారుడైన సుందరరామారెడ్డి రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకం సాధించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.