గోతిలో దిగబడిన లారీ
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:32 AM
అత్యంత దారుణంగా తయారైన భీమిలి- నర్సీపట్నం (బీఎన్) రోడ్డులో వాహనదారులకు అవస్థలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రావికమతం మండలంలో పలుచోట్ల భారీ గోతులు ఏర్పడి, సరకు రవాణా వాహనాలు కూరుకుపోతున్నాయి.
గంటల తరబడి స్తంభించిన ట్రాఫిక్
కొత్తకోటలో తరచూ సంఘటనలు
రావికమతం, అక్టోబరు 1: అత్యంత దారుణంగా తయారైన భీమిలి- నర్సీపట్నం (బీఎన్) రోడ్డులో వాహనదారులకు అవస్థలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రావికమతం మండలంలో పలుచోట్ల భారీ గోతులు ఏర్పడి, సరకు రవాణా వాహనాలు కూరుకుపోతున్నాయి. మంగళవారం ఉదయం నర్సీపట్నం నుంచి రావికమతం వైపు లోడుతో వస్తున్న లారీ కొత్తకోట హైస్కూల్ వద్ద గొయ్యిలో కూరుకుపోయింది. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న కొత్తకోట ఎస్‌ఐ శ్రీనివాసరావు వచ్చి రెండు ఎక్ ్సకవేటర్‌లను రప్పించారు. వీటి సహాయంతో లారీని బయటకు తీయించారు. ఇదే గొయ్యిలో గత వారం రోజుల్లో మూడు వాహనాలు కూరుకుపోయాయి. వర్షాలు పడకపోయినప్పటికీ మెయిన్ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో వాడుక నీరు ఈ గోతుల్లో చేరుతున్నది. రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు ఎప్పుడు పునఃప్రారంభం అవుతాయో చెప్పలేని పరిస్థితిలో ఆర్‌అండ్‌బీ అధికారులు వున్నారు. అప్పటిలోగా కనీసం గోతులైనా పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.