నేలకొరిగిన భారీ వృక్షం
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:51 AM
మండలంలోని ఆంధ్ర, ఒడిశా సరిహద్దు గోరపూర్ రైల్వే స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై మంగళవారం ఉదయం ఓ భారీ వృక్షం విరిగి పడింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నానిపోవడంతో నేలమట్టమైంది. ఇది ప్రధాన రహదారి కావడంతో నిత్యం వాహనాల రద్దీ ఉంటుంది.
- గోరపూర్ ప్రధాన రహదారిపై పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం
డుంబ్రిగుడ, అక్టోబరు 1: మండలంలోని ఆంధ్ర, ఒడిశా సరిహద్దు గోరపూర్ రైల్వే స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై మంగళవారం ఉదయం ఓ భారీ వృక్షం విరిగి పడింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నానిపోవడంతో నేలమట్టమైంది. ఇది ప్రధాన రహదారి కావడంతో నిత్యం వాహనాల రద్దీ ఉంటుంది. కాగా రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షం పడిపోవడంతో సుమారు గంటన్నర సేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానిక గ్రామస్థులతో పాటు వాహనదారులు చెట్టుకొమ్మలను తొలగించడంతో రాకపోకలు యఽథావిధిగా కొనసాగాయి. చెట్టు విరిగిపడే సమయానికి ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.