Share News

జిల్లాలో తొలి రోజు 95.76 శాతం పెన్షన్ల పంపిణీ

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:50 AM

జిల్లాలో తొలి రోజైన మంగళవారం 95.76 శాతం పింఛన్లు పంపిణీ చేశారు. జిల్లాలోని 22 మండలాల పరిధిలో మొత్తం 1.24,778 మంది పెన్షన్‌ లబ్ధిదారులకు గాను తొలి రోజు రాత్రి 8 గంటల వరకు 1,19,482 మందికి రూ.49 కోట్ల 73 లక్షల 76 వేల 500 పెన్షన్‌ సొమ్ము అందజేశారు.

జిల్లాలో తొలి రోజు 95.76 శాతం పెన్షన్ల పంపిణీ
జిల్లాలోని మారేడుమిల్లిలో మహిళకు పెన్షన్‌ సొమ్ము అందిస్తున్న కలెక్టర్‌ ఏఎన్‌ దినేశ్‌కుమార్‌

- మొత్తం లబ్ధిదారులు 1,24,778 మంది

- 1,19,482 మందికి అందజేత

- కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, కూటమి నేతలు

పాడేరు, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలి రోజైన మంగళవారం 95.76 శాతం పింఛన్లు పంపిణీ చేశారు. జిల్లాలోని 22 మండలాల పరిధిలో మొత్తం 1.24,778 మంది పెన్షన్‌ లబ్ధిదారులకు గాను తొలి రోజు రాత్రి 8 గంటల వరకు 1,19,482 మందికి రూ.49 కోట్ల 73 లక్షల 76 వేల 500 పెన్షన్‌ సొమ్ము అందజేశారు. ఇంకా 5,296 మందికి పెన్షన్‌ అందించాల్సి ఉంది. దీంతో జిల్లాలో తొలి రోజు పెన్షన్ల పంపిణీ 95.76 శాతంగా నమోదైంది. తొలి రోజు పెన్షన్‌ పొందని లబ్ధిదారులకు బుధవారం అందజేస్తామని అధికారులు తెలిపారు. డీఆర్‌డీఏ పీడీ వి.మురళి కాల్‌ సెంటర్‌ ద్వారా జిల్లాలో పెన్షన్ల పంపిణీని పర్యవేక్షించి, కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.

మారేడుమిల్లిలో కలెక్టర్‌ పంపిణీ

కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ రంపచోడవరం డివిజన్‌ మారేడుమిల్లి గ్రామంలో మంగళవారం పలువురు మహిళలకు పెన్షన్‌ సొమ్మును అందించి జిల్లాలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. అనంతగిరి మండలం కొత్తూరు పంచాయతీ కేంద్రంలో టీడీపీ అరకులోయ పార్లమెంట్‌ ఇన్‌చార్జి, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ పలువురికి పెన్షన్‌ పంపిణీ చేశారు. టీడీపీ పాడేరు నియోజకవర్గం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పాడేరు మండలం లగిశపల్లిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం, చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్‌ తమ ప్రాంతాల్లోని పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన పెన్షన్‌ పంపిణీ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2024 | 07:42 AM