జిల్లాలో 7.72 లక్షల మంది ఓటర్లు
ABN , Publish Date - Oct 31 , 2024 | 12:40 AM
జిల్లాలో 7 లక్షల 72 లక్షల 411 మంది ఓటర్లున్నారని జిల్లా అధికారులు తెలిపారు. జిల్లాలోని ఓటర్ల వివరాలపై ముసాయిదా జాబితాలను అధికారులు బుధవారం ప్రకటించారు.
ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
మహిళలు 4,00,625, పురుషులు 3,71,746, ఇతరులు 40 మంది
పాడేరు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 7 లక్షల 72 లక్షల 411 మంది ఓటర్లున్నారని జిల్లా అధికారులు తెలిపారు. జిల్లాలోని ఓటర్ల వివరాలపై ముసాయిదా జాబితాలను అధికారులు బుధవారం ప్రకటించారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1023 పోలింగ్ కేంద్రాలు, 3 లక్షల 71 వేల 746 మంది పురుషులు, 4 లక్షల 625 మంది మహిళలు, 40 మంది ఇతరులు కలిపి మొత్తం 7 లక్షల 72 లక్షల 411 మంది ఓటర్లున్నారని ప్రకటించారు. నియోజకవర్గాల వారీగా పరిఽశీలిస్తే పాడేరు నియోజకవర్గంలో 318 పోలింగ్ కేంద్రాలు, లక్షా 20 వేల 63 మంది పురుషులు, లక్షా 28 వేల 853 మంది మహిళలు, 15 మంది ఇతరులు.. మొత్తం 2 లక్షల 48 వేల 931 మంది ఓటర్లున్నారు. అలాగే అరకులోయ నియోజకవర్గంలో 306 పోలింగ్ కేంద్రాలు, లక్షా 19 వేల 760 మంది పురుషులు, లక్షా 26 వేల 370 మంది మహిళలు, 9 మంది ఇతరులు.. మొత్తం 2 లక్షల 46 వేల 139 మంది ఓటర్లున్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో 399 పోలింగ్ కేంద్రాలు, లక్షా 31 వేల 923 మంది పురుషులు, లక్షా 45 వేల 402 మంది మహిళలు, 16 మంది ఇతరులు.. మొత్తం 2 లక్షల 77 వేల 341 మంది ఓటర్లున్నారు.