Share News

ఫెంగల్‌.. కలవరం

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:35 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావం జిల్లాపై లేకపోయినా శుక్రవారం మధ్యాహ్నం నుంచి మబ్బుల వాతావరణం రైతు లను కలవర పెడుతోంది.

ఫెంగల్‌.. కలవరం
ముదినేపల్లి మండలం పెయ్యేరులో గాలులకు నేలకొరిగిన వరి పైరు

మబ్బుల వాతావరణంతో రైతుల బెంబేలు

హడావిడిగా మాసూళ్లు.. ధాన్యం అమ్మకాలు

ఏలూరు సిటీ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావం జిల్లాపై లేకపోయినా శుక్రవారం మధ్యాహ్నం నుంచి మబ్బుల వాతావరణం రైతు లను కలవర పెడుతోంది. ఫెంగల్‌ తుఫాన్‌ ముప్పు తప్పినా తీవ్ర వాయుగుండం కొనసాగుతుండడంతో అక్క డక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబు తున్నారు. జిల్లాలో 80 వేల హెక్టార్లలో సార్వా లో వరి సాగు చేశా రు. ప్రస్తుతం వరి మాసూళ్లు ముమ్మ రంగా సాగుతు న్నాయి. ఇప్పటికే 45 శాతం కోతలు పూర్త య్యాయి. కోసిన వరి పంటను రక్షించు కోవడా నికి రైతులు బరకాలను సిద్ధం చేసుకున్నారు. రోడ్లపై ఆరబోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు రాత్రి సమయాల్లో చలి విపరీతంగా పెరి గింది. గురువారం రాత్రి ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కాగా, శుక్రవారం రాత్రి ఉష్ణోగ్రత 23 డిగ్రీ సెంటీగ్రేడ్‌గా ఉంది.

వాహనాల కొరత

ముదినేపల్లి : భారీగా వీస్తున్న గాలు లకు ముదినేపల్లి మండలంలో ఇప్పటికే వందలాది ఎకరాల్లో వరి పైరు నేలకొరి గింది. రెండు వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అమ్మకానికి సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో వర్షం కురిస్తే తీవ్రంగా నష్టపోతామంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసేందుకు వాహనాల కొరత ఏర్పడింది. శుక్రవారం మండలంలో వెయ్యి మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగినట్టు డీసీఎంఎస్‌ మండల ఇంచార్జ్‌ విజయ్‌ తెలిపారు.

చెరువుల్లో ఆక్సిజన్‌ లోపం

కలిదిండి : తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో రానున్న రెండు రోజులు ఆక్వా రైతులు అప్రమత్తంగా ఉండాలని మత్స్య శాఖాభివృద్ధి అధికారి రవికుమార్‌ తెలిపా రు. కలిదిండిలో శుక్రవారం రొయ్యల చెరువులను పరిశీలించారు. భారీ వర్షాలు కురిస్తే చెరువుల్లో నీరు చల్లబడి ఆక్సిజన్‌ లోపించి రొయ్యల చనిపోయే ప్రమాదం ఉందని నిరంతరాయంగా ఏరియేటర్లు తిరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్సిజన్‌ ట్యాబెట్స్‌ నిల్వ ఉంచుకోవాలని, విద్యుత్‌ కోత విధిస్తే ప్రత్యామ్నాయంగా అద్దె జనరేటర్లను ఏర్పాటు చేసుకోవాల న్నారు. మేత తక్కువగా వేయాలన్నారు.

అప్రమత్తంగా ఉండాలి..

కైకలూరు : తుపాన్‌ ప్రభావంతో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరి రైతులంతా అప్రమత్తంగా ఉండి తమ పంటలను కాపాడుకోవాలని ఆర్డీవో డాక్టర్‌ ఎం.అచ్యుత్‌ అంబరీష్‌ అన్నారు. కైకలూరు మండలం తామరకొల్లులో శుక్రవారం ధాన్యం రాశులను పరిశీలించారు. వ్యవసాయ శాఖ ఏవో ఆర్‌ దివ్య, వీఆర్వో రాజబాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 12:35 AM