Share News

అందరినీ ఆదుకునేలా!

ABN , Publish Date - Sep 05 , 2024 | 03:45 AM

బీమా కవరేజీ ఉండి వరదల్లో ముంపునకు గురైన వాహనాలకు పది లేదా పన్నెండు రోజుల్లో పరిహారం అందేలా చూ స్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. బుధవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘

అందరినీ ఆదుకునేలా!

వాహనాలకు 12 రోజుల్లో బీమా పరిహారం

అమరావతి, సెప్టెంబర్‌ 4 (ఆంధ్రజ్యోతి): బీమా కవరేజీ ఉండి వరదల్లో ముంపునకు గురైన వాహనాలకు పది లేదా పన్నెండు రోజుల్లో పరిహారం అందేలా చూ స్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. బుధవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఈ రోజు బ్యాంకర్లు, ఇన్స్యూరెన్స్‌ కంపెనీల ప్రతినిధులతో మాట్లా డాం. బీమా పరిహారం పది రోజుల్లో ఇవ్వాలని కోరాం. మహా అయితే ఇంకో రెండు రోజులు దాటనివ్వవద్దని చెప్పాం. వాళ్లు ఇందుకు అంగీకరించారు. బీమా కవరేజీ లేని వాహనాలకు ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. వరద ల్లో వ్యాపారాలు నష్టపోయిన వారి బ్యాంకు రుణాలపై బ్యాంకు అధికారులతో మాట్లాడాం. వారి కోసం ఒక ప్యా కేజీ రూపొందించాలని భావిస్తున్నాం. వ్యాపార సంఘాలతో కూడా మాట్లాడి వారి ఆలోచనలు కూడా తెలుసుకుంటాం. సొంత పెట్టుబడితో చిన్న వ్యాపారాలు చేస్తూ నష్టపోయిన వారూ ఉన్నారు. వారి గురించి కూడా ఆలోచిస్తున్నాం. ఇళ్లలో ఫర్నీచర్‌, ఎలక్ర్టానిక్‌ వస్తువులు, ఇంటి సామాన్లు బాగా దెబ్బతిన్నాయి. ఆ కుటుంబాలను ఎలా ఆదుకోవాలో కూడా చర్చిస్తున్నాం’’ అని చంద్రబాబు వివరించారు. వరద తగ్గిన చోట బాధితులకు గురువారం నుంచి ఇంటికి పాతిక కిలోల బియ్యం, కిలో పప్పు, చక్కెర, ఒక లీటర్‌ పామాయిల్‌, రెండు కిలోలు బంగాళాదుంపలు, ఉల్లిపాయలు ఇస్తామని, అందరికీ ఈ సాయం ఇస్తామని ఆయన తెలిపారు.

విరివిగా సాయం చేయండి

ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.వెయ్యికి లోపు విరాళం ఇచ్చిన వారు పదిహేను వందల మంది ఉన్నారని చంద్రబాబు తెలిపారు. ప్రతివారూ తోచినంత ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దూర ప్రాంతాల నుంచి అనేక మంది ఆహారం వండుకొని తీసుకు వస్తున్నారని, అది పాడైపోతోందని తెలిపారు. అలా అలా వండుకొని తేవద్దని ఆయన కోరారు. నిల్వ ఉండే ఆహార పదార్థాలు తేవాలని లేదా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇవ్వాలని సూచించారు. కూరగాయలను మూడు రకాలుగా వర్గీకరించి రూ.రెండు, ఐదు, పది రూపాయలకు ప్రభుత్వం తరఫున విక్రయిస్తామని తెలిపారు. దొంగతనాలు జరగ కుండా గస్తీ పెంచుతామని చెప్పారు.

Updated Date - Sep 05 , 2024 | 07:30 AM