అదిగో..పులి
ABN , Publish Date - Oct 20 , 2024 | 01:00 AM
అదిగో....పులి అంటూ మండలం లోని ఎం.నాగులపల్లి ప్రాంత వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
ఎం.నాగులపల్లిలో కలకలం పాదగుర్తులను సేకరిస్తున్న భీమడోలు సీఐ, అటవీ అధికారులు
ద్వారకాతిరుమల, అక్టోబరు 19 (ఆంధ్ర జ్యోతి): అదిగో....పులి అంటూ మండలం లోని ఎం.నాగులపల్లి ప్రాంత వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. జిల్లాలో కొద్దిరోజుల కిందట పులి సంచారం ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఆపై దాని జాడ లేదు. అయితే ఎం.నాగు లపల్లిలోని పాత కొవ్వూరు రోడ్డు సమీపం లోని బ్రిక్స్ ఫ్యాక్టరీ పక్క నుంచి శనివారం కాస్త చీకటి పడిన తర్వాత పులి వెళ్తుం డగా చూశామంటూ కొందరు వ్యక్తులు భయాందోళనతో పోలీసులకు ఫోన్‌లు చేశారు. దీంతో పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు ఈ వార్త పరిసర ప్రాంతాల్లో దానావలంలా వ్యాపిం చింది. స్థానికులు అటువైపుగా వెళ్లాలంటే వణికి పోతున్నారు. అయితే ఇది పుకార్లని కొందరు కొట్టి పాడేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న భీమడోలు ఎస్‌ఐ స్పందించి ఇద్దరు పోలీసులను అక్కడికి పంపి విచా రించారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధి కారుల దృష్టికి తీసుకెళ్లారు. భీమడోలు సీఐ విల్సన్, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పాదగుర్తులను పరి శీలించి పులివేనని నిర్ధారించారు.