Share News

ఆస్పత్రికి వెళ్లే మార్గం లేక పాస్టర్‌ మృతి

ABN , Publish Date - Sep 05 , 2024 | 03:49 AM

బుడమేరు వరద ముంపులో చిక్కుకుపోయిన ఓ పాస్టర్‌ అనారోగ్యంపాలై, ఆస్పత్రికి వెళ్లే మార్గం లేక ప్రాణం కోల్పోయారు. అంత్యక్రియలకు శ్మశానానికి తరలించేందుకూ మార్గం లేక బంధువులు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా అధికారులు స్పందించలేదు. దీంతో 12 గంటలపాటు మృతదేహం ఇంటిలోనే ఉండిపోయింది.

ఆస్పత్రికి వెళ్లే మార్గం లేక పాస్టర్‌ మృతి

12 గంటలపాటు ఇంట్లోనే మృతదేహం

సీఎం దృష్టికి వెళ్లడంతో ఎట్టకేలకు ట్రాక్టర్‌ ఏర్పాటు

విజయవాడ, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): బుడమేరు వరద ముంపులో చిక్కుకుపోయిన ఓ పాస్టర్‌ అనారోగ్యంపాలై, ఆస్పత్రికి వెళ్లే మార్గం లేక ప్రాణం కోల్పోయారు. అంత్యక్రియలకు శ్మశానానికి తరలించేందుకూ మార్గం లేక బంధువులు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా అధికారులు స్పందించలేదు. దీంతో 12 గంటలపాటు మృతదేహం ఇంటిలోనే ఉండిపోయింది. చివరికి విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఎట్టకేలకు అధికారులు ట్రాక్టర్‌ను ఏర్పాటు చేశారు. విజయవాడలోని వాంబేకాలనీ ుజి్‌ బ్లాక్‌లో ప్టాసర్‌ రాజు కుటుంబం నివసిస్తోంది. ఆదివారం బుడమేరు వరద ముంచెత్తడంతో ఆ ప్రాంతవాసులు ఇళ్ల నుంచి బయటికి వచ్చే మార్గం లేకుండా పోయింది. ఈనేపథ్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న రాజును ఆస్పత్రికి తరలించేందుకూ మార్గం లేక ఇంట్లోనే ఉంచేశారు. మంగళవారం అర్ధరాత్రి 2గంటల సమయంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతంలోని శ్మశాన వాటికలూ వరదలో చిక్కుకుపోవడంతో వేరే శ్మశానవాటికకు తీసుకెళ్లి ఖననం చేయాలని నిర్ణయించారు. రాజు కుటుంబ సభ్యులు స్థానిక రాజకీయ నేతలకు, అధికారులకు ఫోన్లు చేశారు. ఆయన చనిపోయి 12 గంటలు దాటినా అధికారులు బోటు గానీ, ట్రాక్టర్‌ గానీ పంపలేదు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో సీఎం మాట్లాడుతుండగా విలేకర్లు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అధికారులు ట్రాక్టర్‌ను పంపారు.

Updated Date - Sep 05 , 2024 | 07:22 AM