Share News

మాలల ఐక్యతతోనే వర్గీకరణకు చరమగీతం

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:01 AM

మాలల ఐకమత్యంతో ఎస్సీ వర్గీకరణకు చరమగీతం పాడుదామని మాజీ ఎంపీ హర్ష కుమార్‌, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్‌ కుమార్‌ అన్నారు.

   మాలల ఐక్యతతోనే వర్గీకరణకు చరమగీతం
మాట్లాడుతున్న ఎంపీ హరీష్‌ కుమార్‌

మాజీ ఎంపీ హర్షకుమార్‌

ఆదోని, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : మాలల ఐకమత్యంతో ఎస్సీ వర్గీకరణకు చరమగీతం పాడుదామని మాజీ ఎంపీ హర్ష కుమార్‌, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం ఆదోనిలో మాలల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ముందుగా ఆర్ట్స్‌ కళాశాల జేబీ గార్డెన నుంచి పురవీధులలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. జేబీ గార్డెనలో నిర్వహించిన సభలో వారు మాట్లాడారు. సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడం అన్యాయమన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే మాల, మాదిగలను విడదీస్తున్నారని ఆరోపించారు. మాలలంతా ఐక్యతతో ముందుకు సాగకపోతే మనుగడ కష్టంగా మారుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా వర్గీకరణపై పునరాలోచించుకొని వెనక్కి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు న్యాయవాది చంద్రయ్య, కొండలరావు కుమార్‌ స్వామి, జై భీమ్‌ సాయి, కల్లుబోతుల సురేష్‌, విజయ, శేఖర్‌, విజయ్‌ కుమార్‌, మాధవస్వామి, బొబ్బిలి, ఎల్లప్ప, మహానంది పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 12:01 AM