టీచర్స్ ఓటు.. హక్కులకు చోటు!
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:30 AM
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు వేడెక్కింది. వివిధ సంఘాల మధ్య నువ్వానేనా అన్నట్టుగా పోటీ నెల కొంది. గతంలో గెలిచిన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునే దిశగా యూటీఎఫ్ అన్ని పావులు కదిపింది
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో హోరాహోరీ
ఇంటింటికీ ఓటరు స్లిప్‌లు.. మోడల్ బ్యాలెట్‌లు
హక్కులు సాధిస్తామంటూ ఎవరంతట వారు ప్రచారం
గడువు దగ్గరపడడంతో పాఠశాలలకు వెళ్లి అభ్యర్థుల వేడుకోలు
బహుమతులంటూ భారీగా వదంతులు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు వేడెక్కింది. వివిధ సంఘాల మధ్య నువ్వానేనా అన్నట్టుగా పోటీ నెల కొంది. గతంలో గెలిచిన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునే దిశగా యూటీఎఫ్ అన్ని పావులు కదిపింది. ఇంకోవైపు వివిధ సంఘాలు బలపరి చిన ఎస్టీయూ అభ్యర్థి గంధం నారా యణరావు ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. పోటీలో ఉన్న మరి కొంతమంది అభ్యర్థులు ఉపా ధ్యాయుల హక్కులను కాపాడా లంటే తమకు మద్దతు ఇవ్వా లంటూ విస్తృత ప్రచారానికి దిగారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు గడువు దగ్గరపడింది. పట్టుమని ఐదు రోజుల సమయం లేకపోవడంతో రంగంలో ఉన్న అభ్యర్థులంతా ప్రచారంలో వేగాన్ని పెంచా రు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వచ్చేనెల 5వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మిగిలి ఉన్న అతి తక్కువ సమయంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని యూనియన్లు సర్వశక్తులు ఒడ్డుతు న్నాయి. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్థి సాబ్జీ గెలుపొందారు. ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఎన్నికలు అనివార్య మయ్యాయి. సాధారణ ఎన్నికలను తల పించేలా ఎమ్మెల్సీ ఎన్నికల వాతావరణం మారింది. ఈ పరిస్థితుల్లో ఈసారి ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోను ఎవరైనా అభ్య ర్థులు బహుమతులు ఇవ్వక పోతారా.. అనే సందిగ్దత ఓటర్లలో ఉంది. పోలింగ్ జరిగే 5వ తేదీకి 48 గంటలు ముందుగానే ఒకరి ద్దరు అభ్యర్థులు పెద్ద ఎత్తున ఉపాధ్యాయు లకు బహుమతులు అందజేయనున్నా రం టూ ఇప్పటికే ప్రచారం వేడెక్కింది. గత అనుభవాలను పోల్చుకుంటే 2007, 2009లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాయిలాలు పంచారు. ఎవరు వద్దన్నా, కావాలన్నా లెక్క చేయకుండా వెండి వస్తువులను ఓటర్లకు ఎరవేశారు. విధాన పరిషత్ తిరిగి 2007లో పునరుద్ధరించిన తర్వాత ఇప్పుడు ఐదవ సారి ఎన్నికలు జరుగుతున్నాయి. 2007లో శేషారెడ్డి, 2009లో చైతన్యరాజు, 2015లో రాము సూర్యారావు, 2021లో సాబ్జీ ఉమ్మడి గోదా వరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ లుగా గెలుపొందారు. అప్పటి ఎన్నికల వాతావరణం ఊహించని రీతిలో బహుమ తుల వైపు మళ్ళింది. కాని ఈసారి రంగం లో ఉన్న అభ్యర్థులు ఉపాధ్యాయ హక్కుల కోసమే తాము పోరాడుతున్నట్టు, అందుకే తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తు న్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో గోపీమూర్తి, వెంకటలక్ష్మి, నాగేశ్వరరావు, దీపక్, నారా యణరావు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ ఐదుగురు ఉపాధ్యాయ ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
ఇంటింటికీ ఓటర్ల స్లిప్‌లు..
ఎన్నికలు జరిగేందుకు కేవలం ఐదు రోజుల సమయమే మిగిలి ఉండడంతో అభ్యర్థులంతా ప్రచారంలో ఊపు తెచ్చేం దుకు ప్రయత్నిస్తున్నారు. యూటీఎఫ్‌తో పాటు ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్, బహుజన టీచర్స్ అసోసియేషన్, కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్, గవర్నమెంటు లెక్చరర్స్ అసోసియేషన్, ఏపీటీఎఫ్–1936, పీఆర్టీయూ యూనియన్లకు చెందిన టీచర్ల మద్దతుతో గోపిమూర్తి ప్రచారంలో కాస్త వేగంగానే ముందుకు వెళ్తున్నారు. ఆయన పక్షాన వామపక్షాలకు చెందిన నేతలు దగ్గ రుండి ఎన్నికల తతంగాన్ని నడుపుతున్నా రు. ఇప్పటికే సాధారణ ఎన్నికలను తల పించే రీతిలో ఓటరు లిస్టులను ఆయా ఉపాధ్యాయుల ఇళ్లకు వెళ్లి మరీ అందిస్తు న్నారు. యూటీఎఫ్ బలపరిచిన అభ్యర్థి రెండుసార్లు వరుస విజయాలు సాధించ డంతో ఈసారి ఎలాగైనా ఆ ఆనవాయితీని తప్పించాలని మిగతా యూనియన్లు పట్టు దలతో ప్రచారం సాగిస్తున్నాయి. ఎమ్మెల్సీ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దరిమిలా జరుగుతున్న ఈ ఎన్నికలు మరో మారు తమకు అనుకూలంగా మార్చుకునేం దుకు యూటీఎఫ్‌తో పాటు మిగతా యూని యన్లు సర్వశక్తులు ఒడ్డి ప్రచారంలో ముందు వరుసలో నిలిచేందుకు ప్రయత్ని స్తున్నాయి. జిల్లాలో అత్యధికంగా ఏలూరు లోనే 40 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. జిల్లా మొత్తం మీద 2,667 మంది ఓటర్లు ఉండగా ఇక్కడే అత్యధికులు ఓటర్లు అందు బాటులో ఉండడంతో ఏలూరువైపే అభ్యర్థు లంతా ప్రధానంగా దృష్టి నిలిపారు. వీలు చిక్కినప్పుడల్లా పాఠశాల విరామ సమయం లో ఉపాధ్యాయులను కలుసుకుని మద్దతు అభ్యర్థిస్తున్నారు. తమకు ఓటర్ల మద్దతు దక్కేలా ప్రచారంలో టీచర్ల సెల వుల అంశాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. ఎటువంటి హక్కుల భంగం ఉపాధ్యా యులు ఎదుర్కొకుండా చూస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు.