Share News

వరద సహాయక చర్యల్లో ముమ్మరంగా టీడీపీ శ్రేణులు

ABN , Publish Date - Sep 05 , 2024 | 03:41 AM

విజయవాడలో వరద బాధితులకు సేవలందించేందుకు 1800 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు, నేతలు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ వెల్లడించారు.

వరద సహాయక చర్యల్లో ముమ్మరంగా టీడీపీ శ్రేణులు

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ వెల్లడి

అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): విజయవాడలో వరద బాధితులకు సేవలందించేందుకు 1800 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు, నేతలు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలకు విజయవాడలోని వేర్వేరు చోట్ల సహాయక కార్యక్రమాలను అప్పగించామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం ఇస్తున్న ఆదేశాలకు, మంత్రి నారా లోకేశ్‌ ఇస్తున్న మార్గదర్శకాలకు అనుగుణంగా వీరంతా పనిచేస్తున్నారన్నారు. విజయవాడ సెంట్రల్‌, ఈస్ట్‌, వెస్ట్‌, గన్నవరం నియోజకవర్గాల్లోని 36 వార్డులు, మండలాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు అప్పగించిన బాధ్యతలను వీరు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. 9 మ్యాప్డ్‌ వలంటీర్‌ బృందాలు 409 మంది కార్యకర్తలతో పనిచేస్తున్నాయని, 36 మంది ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతల నేతృత్వంలో 36 బృందాలుగా 1,112 మంది క్షేత్రస్థాయి సహాయ కార్యక్రమాల్లో సేవలందిస్తున్నారని, 11 మంది మంత్రుల నేతృత్వంలో 240 మంది కార్యకర్తలు పనిచేస్తున్నారని వివరించారు.

Updated Date - Sep 05 , 2024 | 03:42 AM