Lokesh: జగన్.. ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో తగ్గేదేలే
ABN , Publish Date - Feb 13 , 2024 | 04:23 PM
Andhrapradesh: టీడీపీ వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. మంగళవారం పాలకొండ నియోజకవర్గం శంఖారావం కార్యక్రమంలో యువనేత మాట్లాడుతూ.. కోట్ల ఖర్చుపెట్టి యాత్ర 2ని తీశారని.. ఎవ్వరూ చూడటం లేదన్నారు.
ఉమ్మడి శ్రీకాకుళం, ఫిబ్రవరి 13: టీడీపీ వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (TDP Leader Nara Lokesh) అన్నారు. మంగళవారం పాలకొండ నియోజకవర్గం శంఖారావం కార్యక్రమంలో యువనేత మాట్లాడుతూ.. కోట్ల ఖర్చుపెట్టి యాత్ర 2ని తీశారని.. ఎవ్వరూ చూడటం లేదన్నారు. ఎమ్మెల్యే, ఎంపీలకు టికెట్‌లు ఇచ్చి వైసీపీ నేతలు సినిమా చూపిస్తున్నారన్నారు. పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి అని ప్రశ్నించారు. చంద్రబాబులా గుర్తింపు కోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం ప్రయత్నిస్తున్నారన్నారు. అది జగన్ వలన సాధ్యం కాదన్నారు. చంద్రబాబు అంటే ఒక విజనరీ అని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి అంటే జైల్ గుర్తు వస్తుందని వ్యాఖ్యలు చేశారు. ‘‘నువ్వే మా నమ్మకం బోర్డులు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నీ తల్లి, చెల్లిల్లే నిన్ను నమ్మడం లేదు. నిన్ను ప్రజలు ఎలా నమ్ముతారు’’ అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రానికి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆఖరికి ప్రజలు పీల్చిన గాలికి కూడా పన్నులు వేస్తారని విమర్శించారు. గిరిజనులకు చెందిన 16 పథకాలు రద్దు చేశారన్నారు.
టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పడిన తరువాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. విశాఖలో కట్టిన ప్యాలస్‌ను ప్రజల అవసరాల కోసం ఉపయోగిస్తామని తెలిపారు. పాలకొండలో కళావతిని రెండు సార్లు గెలిపించారని.. ఆమె ఏమైనా అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. పాలకొండలో ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ విక్రాంథ్‌లు ఇసుక దోపిడి చేస్తున్నారని ఆరోపించారు. బినామీల పేరు మీద ఆస్తులు సంపాదిస్తున్నారన్నారు. పాలకొండ నియోజకవర్గం రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని మండిపడ్డారు. ‘‘బాంబులకే భయపడని కుటుంబం మాది మీ బెదిరింపు లకి భయపడతామా. జగన్ మోహన్ రెడ్డి మాపై ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో తగ్గేదిలే’’ అని లోకేష్ స్పష్టం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...