బొమ్మ తొలగింది!
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:33 AM
ప్రజల భూముల్లో వైఎస్సార్ జగనన్న భూరక్ష 2020 పేరుతో పాతిన సర్వే రాళ్లపై అప్పటి సీఎం జగన్ మోహన్‌రెడ్డి తనపేరు, బొమ్మ ముద్రించుకున్నారు. ఈ నిర్ణయంపై అన్ని వర్గాలు వ్యతిరేకించినా జగ న్ పట్టించుకో లేదు.
ప్రజాధనం.. రాళ్ల పాలు చేసిన జగన్ సర్కార్
ప్రజలు వద్దన్నా అప్పట్లో సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు.. పేర్లు
ప్రస్తుతం తొలగించే పనిలో రెవెన్యూ, సర్వేశాఖ బిజీబిజీ
అప్పట్లో రాయి పాతేందుకు రూ.150.. ఇప్పుడు తొలగిం చేందుకు రూ.60 వ్యయం
నాటి వైసీపీ ప్రభుత్వ పాపం.. ప్రజల నెత్తిన భారం
ఏలూరు రూరల్, నవంబరు 29 (ఆంధ్ర జ్యోతి): వైసీపీ పాలనలో జరి గిన పాపాల ఫలితం జనాలు ఇప్ప టికే అనుభవిస్తూనే ఉన్నారు. ప్రజల భూముల్లో వైఎస్సార్ జగనన్న భూరక్ష 2020 పేరుతో పాతిన సర్వే రాళ్లపై అప్పటి సీఎం జగన్ మోహన్‌రెడ్డి తనపేరు, బొమ్మ ముద్రించుకున్నారు. ఈ నిర్ణయంపై అన్ని వర్గాలు వ్యతిరేకించినా జగ న్ పట్టించుకో లేదు. ఫలితంగా ప్రజల మీద కోట్లభారం పడింది. ఇప్పుడు ఆ పేర్లు, బొమ్మలు తొల గించడానికి మళ్ళీ కోట్లాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. జగనన్న బొమ్మ పడినా, తీసేసినా జనం జేబులకు చిల్లుపడుతోంది.
వైసీపీ ప్రభుత్వం జగ నన్న భూరక్ష 2020 కార్యక్రమం ద్వారా భూముల రీ సర్వే మొదలు పెట్టింది. జిల్లా లోని రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటికే 154 గ్రామాల్లో సర్వే పూర్తయింది. సర్వే పూర్తయిన గ్రామాల్లో మైనింగ్ శాఖ పంపిణీ చేసిన సర్వేరాళ్లు పాతారు. జిల్లాలో సుమారు లక్షా57,223 రాళ్లను సరఫరా చేశారు. ఇప్పటివరకు జిల్లాలో లక్షా42 వేలకు పైగా సర్వేరాళ్లను పాతారు. వాటిపై అప్పటి సీఎం జగన్ పేరు, బొమ్మలు ముద్రిం చారు. అప్పట్లో ఈ నిర్ణయంపై ప్రజలు అభ్యంతరం తెలిపినా ఏమాత్రం పట్టించుకోలేదు. ఒక్కోరాయి పాతడానికి రూ.150 ఖర్చు అయింది.
తొలగించేందుకు రూ.60
కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సర్వేరాళ్లపై జగన్ బొమ్మలు, పేర్లు తొలగించేందుకు చర్యలు చేపట్టింది. రాళ్ళపై జగనన్న బొమ్మలు, పేర్లు తొలగించేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. తొలుత సాండ్ పేపర్‌ను ఉపయోగించినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. పైగా ఒక్కో రాయికి రూ.60లు ఖర్చు అవుతుంది. దీంతో ఆ పద్ధతిని అధికారులు విరమించుకున్నారు. యంత్రసాయంతో అయితే రూ.15 మాత్రమే వ్యయం అవుతుంది కాబట్టి శుక్రవారం నుంచి యంత్రాల సాయంతో జగన్ బొమ్మ లు, పేర్లు తొలగిస్తున్నారు. తహసీల్దార్లు, సర్వే అధికారులు సాధ్యమైనంత త్వరగా ఈ పని పూర్తి చేయాలని భావిస్తున్నారు. భూసర్వే పేరుతో వైసీపీ ప్రభుత్వం పొలాల సరిహద్దులు నిర్ధారించి పాతేందుకు తెచ్చిన సర్వేరాళ్లు చాలా నిరుపయోగంగానే పడి ఉన్నాయి. రీసర్వే జరిగిన గ్రామాల్లో సైతం ఈ రాళ్లను పూర్తిగా వాడలేదు. దీంతో కొన్ని రైతుల పొలాల వద్ద, గ్రామ సచివాలయాల వద్ద వృఽథాగా పడిఉన్నాయి. అంతేకాకుండా రీసర్వేను తప్పులతడకగా చేశారని ఆరోపిస్తూ పలువురు రైతులు రాళ్లను ఏర్పాటు చేసేందుకు ఒప్పుకోలేదు.