Share News

యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:12 AM

తండ్యాం పంచాయతీ గూనానిపేటకు చెందిన కుమరాపు దుర్గారావు(28) అనే యువకుడు ఆత్మహత్య చేసుకు న్నాడు.

యువకుడి ఆత్మహత్య

పొందూరు: తండ్యాం పంచాయతీ గూనానిపేటకు చెందిన కుమరాపు దుర్గారావు(28) అనే యువకుడు ఆత్మహత్య చేసుకు న్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వ్యక్తిగత కారణా లతో రెండురోజుల కిందట ఇంటిలో ఉన్న పురుగుల మందు తాగి అస్వస్థతకు గురైన దుర్గారావును కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స కోసం చేర్పించారు. అక్కడ చికిత్స పొందూరు సోమవారం మృతి చెందాడు. రిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. అతడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేశారు. కాగా దుర్గారావు జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా పనిచేసేవాడు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

టెక్కలి: జాతీయ రహదారి గొల్లూరు సమీపంలో మంగవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెంటూరు గ్రామానికి చెందిన సనపల గోవింద్‌, ప్రగడ బాలకృష్ణ ద్విచక్ర వాహనంపై మం గళవారం ఉదయం టెక్కలి వైపు వస్తుండగా వెనుక నుంచి వస్తున్న ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ కారును ఢీకొట్టింది. దీంతో కారు వెనుక భాగంగా నుజ్జయింది. అదే సమయంలో అటుగా వస్తున్న టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జి పేడాడ తిలక్‌ క్షతగాత్రులను హుటాహుటిన టెక్కలిలోని జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రావివలస జంక్షన్‌ సమీపంలో ఒకరికి..

టెక్కలి: నౌపడా-మెళియాపుట్టి మార్గంలో రావివలస జంక్షన్‌ సమీపంలో మంగళ వారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు గాయపడ్డాడు. తేలినీలాపు రానికి చెందిన వి.దుష్యంత్‌ టెక్కలి నుంచి స్వగ్రామానికి వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొనడంతో దుష్యంత్‌కు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 వాహనంలో టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలిం చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 02 , 2024 | 12:12 AM