ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ
ABN , Publish Date - Sep 04 , 2024 | 11:58 PM
స్థానిక ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఐఎల్‌వో సంయుక్త ఆధ్వ ర్యంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు శిక్షణ తర గతులను బుధవారం ప్రారంభించారు.
అరసవల్లి:స్థానిక ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఐఎల్‌వో సంయుక్త ఆధ్వ ర్యంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు శిక్షణ తర గతులను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిశ్రమల కేంద్రం జీఎం ఉమామహేశ్వరరావు పారి శ్రామికవేత్తలుగా తయారుకావడానికి అవసరమైన మెల కువలు, వ్యాపార నిర్వహణ, శక్తిసామర్థ్యాలు, వివిధ రకాల అనుమతుల గురించి వివరించారు. సెట్‌శ్రీ సీఈవో ప్రసా దరావు ప్రాజెక్టు రిపోర్టు తయారీ, మార్కెట్ మెలకువలు, నిర్వహణ శక్తి సామర్థ్యాలు, ఖాతా పుస్తకాల నిర్వహణ, వ్యాపారంలో పాటించాల్సిన నియమాలు, ఉత్పత్తి సామ ర్థ్యం పెంపు, సేల్స్, మార్కెటింగ్ స్కిల్స్‌ను వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారి కె.సుధ, నైపుణ్యా భివృద్ధి అధికారి పీబీ సాయి శ్రీనివాస్, పర్యాటకాధికారి నారాయణరావు, ఐఎల్‌వో మాస్టర్ ట్రైనర్, మోహన్‌కుమార్ పాల్గొన్నారు.