Share News

వరద బాధితులకు సాయంగా..

ABN , Publish Date - Sep 05 , 2024 | 12:13 AM

విజయవాడ వరద బాధితులకు సాయంగా మేమున్నామంటూ.. జిల్లాలో పెద్ద ఎత్తు న ప్రజలు, స్వచ్ఛంద సేవా సంస్థలు సహాయాన్ని అందిస్తున్నారు.

వరద బాధితులకు సాయంగా..
సరుకులతో వెళ్తున్న బస్సును ప్రారంభిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

అరసవల్లి: విజయవాడ వరద బాధితులకు సాయంగా మేమున్నామంటూ.. జిల్లాలో పెద్ద ఎత్తు న ప్రజలు, స్వచ్ఛంద సేవా సంస్థలు సహాయాన్ని అందిస్తున్నారు. బుధవారం రెడ్‌క్రాస్‌ శ్రీకాకుళం శాఖ చైర్మన్‌ పి.జగన్మోహన్‌ రావు ఆధ్వర్యంలో ఆహార కిట్లతో కూడిన వాహనాన్ని విజయవాడకు పంపిం చారు. ఈ వాహనానికి కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుం డ్కర్‌ బుధవారం రాత్రి జెండా ఊపి ప్రారంభిం చారు. ఈ వాహనంలో సుమారు రూ.5,50,000 విలువ చేసే 12వేల లీటర్ల తాగునీరు, పది కార్టూన్ల బిస్కెట్లు, వంద దోమతెరలు, 500 ఆహార కిట్లు, దుప్పట్లు, తువ్వా ళ్లు ఉన్నాయి. సాయం అందించిన దాతలను కలెక్టర్‌ అభినందించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సెక్రటరీ బలివాడ మల్లేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.

విజయవాడకు కార్మికులు..

బాధిత ప్రజలకు సహాయ సహకా రాలు అందించేందుకు శ్రీకాకుళం మున్సిపల్‌ కార్మికులు విజయవాడకు బస్సులో బయలుదేరారు. ఈ బస్సును ఎమ్మెల్యే గొండు శంకర్‌ ప్రారంభించారు. లయన్స్‌ క్లబ్‌ శ్రీకాకుళం సెంట్రల్‌ వారు సమకూర్చిన విరాళం మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి జమచేసేలా ఎమ్మెల్యే గొండు శంకర్‌కు అందించారు. కార్యక్రమంలో నటుకుల మోహన్‌, ప్రధాన విజయరాం, గుత్తు చిన్నారావు, మాదారపు వెంకటేష్‌, రెడ్డి గిరిజాశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే వరద బాధితులకు సహాయంగా సీపీఎం ఆధ్వర్యంలో నగరంలో విరాళాలు సేకరిస్తున్నారు.

Updated Date - Sep 05 , 2024 | 12:13 AM