రంగనాథ స్వామి ఆలయంలో చోరీ
ABN , Publish Date - Sep 15 , 2024 | 11:54 PM
ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేటలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఊరికి చివరలో ఉన్న ఈ ఆలయాన్ని ఇటీవల గ్రామస్థులు, దాతల సహకారంతో పునర్నిర్మించారు. కాగా.. శనివారం అర్ధరాత్రి వేళ ఈ ఆలయంలోకి దొంగలు ప్రవేశించారు.
ఎచ్చెర్ల, సెప్టెంబరు 15: ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేటలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఊరికి చివరలో ఉన్న ఈ ఆలయాన్ని ఇటీవల గ్రామస్థులు, దాతల సహకారంతో పునర్నిర్మించారు. కాగా.. శనివారం అర్ధరాత్రి వేళ ఈ ఆలయంలోకి దొంగలు ప్రవేశించారు. స్వామికి అలంకరించిన 7 తులాల బంగారం, 3 కిలోల వెండి ఆభరణాలు, హుండీలో రూ.లక్ష నగదు అపహరించారు. ఆలయ ప్రాంగణంలో ఒక హుండీని, సమీప పొలాల్లో మరొక హుండీని పగులగొట్టారు. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం ఆలయ కమిటీ సభ్యులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్, క్లూస్‌టీమ్ సందర్శించి వివరాలను సేకరించారు. ఇటీవల దేవాలయాల్లో దొంగతనాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ మండలంలో గత వారంలో కుంచాలకురమయ్యపేటలోని దుర్గగుడిలో చోరీ జరిగింది. అలాగే ఐదారు నెలల కిందట దేవీ ఆశ్రమంలో భారీ ఎత్తున చోరీ అయింది. వరుసుగా దొంగతనాలు జరుగుతుండడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. రాత్రివేళ గర్భగుడి తలుపులు మూసే సమయంలో స్వామి, అమ్మవారి మీద ఉన్న ఆభరణాలను నిర్వాహకులు తీసేసి.. తిరిగి ఉదయం వేళ వాటిని అలంకరిస్తే మేలని పలువురు అభిప్రాయపడుతున్నారు.