గిల్టునగల ఉదంతంపై పోలీసులను ఆశ్రయించిన బ్యాంకు సిబ్బంది
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:06 AM
నగరంలోని సింహద్వారం వద్ద ఉన్న వెంకటాపురం వద్ద ఓ బ్యాంక్‌లో గిల్టునగలుతో రుణాలు పొందిన ఉదంతాన్ని ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టింది.
శ్రీకాకుళం, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): నగరంలోని సింహద్వారం వద్ద ఉన్న వెంకటాపురం వద్ద ఓ బ్యాంక్‌లో గిల్టునగలుతో రుణాలు పొందిన ఉదంతాన్ని ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టింది. మంగళవారం ‘గిల్టునగలతో రుణాలు’ అనే శీర్షికతో కథనం ప్రచురించడంతో ఇంతవరకు గోప్యత పాటించిన బ్యాంకు సిబ్బంది.. మంగళవారం సాయంత్రం మౌనం వీడారు. గిల్టునగలుతో రుణాలు పొందేందుకు కారణమైన గోల్డ్ అప్రైజర్‌పై ఫిర్యాదు చేసేందుకు బ్యాంకు మేనేజర్, బ్యాంకు సిబ్బంది ఎచ్చెర్ల పోలీసు స్టేషన్‌కు మంగళవారం రాత్రి వెళ్లారు. కోటబొమ్మాళిలో జరుగుతున్న కొత్తమ్మతల్లి ఉత్సవాల బందోబస్తుకు అధిక మంది సిబ్బంది వెళ్లడం తో బుధవారం రావాలని పోలీసులు బ్యాంకు అధికారులకు చెప్పారు. దీంతో తమ వెంట తీసుకువచ్చిన ఆధారాలతో బ్యాంకు అధికారులు వెనక్కి వెళ్లిపోయారు. పూర్తిస్థాయి ఆధారాలతో బుధవారం ఫిర్యాదు చేయనున్నారు.