విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు చర్యలు చేపట్టాలి
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:16 AM
ఆంధ్రుల ఆత్మ బలిదానాలతో సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని అఖిలపక్ష కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు.
అరసవల్లి: ఆంధ్రుల ఆత్మ బలిదానాలతో సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని అఖిలపక్ష కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని ఏడు రోడ్ల జంక్షన్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలో ఆయా సంఘాల నాయకులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, కె.నాగమణి, షన్ముఖరావు, రౌతు శంకరరావు, కె.శ్రీనివాస్, అల్లు మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపాలని ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐవైఎఫ్ సంఘాల ప్రతినిధులు కలెక్టరేట్ వద్ద మంగళవారం నిరసన చేపట్టారు. ఆయా సంఘాల నాయకులు ఎం.యుగంధర్, కొన్న శ్రీనివాస రావు, సీహెచ్ రవి, కూర్మారావు, వసంతరావు తదితరులు పాల్గొన్నారు.