బెడిసికొట్టిన రాజీ చర్చలు
ABN , Publish Date - Oct 21 , 2024 | 11:36 PM
ఇద్దరు బాలికలపై అత్యాచారం ఘటనలో కొందరు పెద్దలు తలదూర్చి చేసిన రాజీ యత్నాలు బెడిసికొట్టాయి.
పలాస, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు బాలికలపై అత్యాచారం ఘటనలో కొందరు పెద్దలు తలదూర్చి చేసిన రాజీ యత్నాలు బెడిసికొట్టాయి. రూ.20 లక్షలు బాధిత కుటుంబాలకు ఇవ్వాలని తొలుత భావించి చివరకు రూ.10 లక్షలు ఇచ్చేందుకు బేరం కుదుర్చు కున్నారు. అయితే ఈ వ్యవహారం చిలిచి చిలికి గాలివానగా మారడం, బాలికలపై మైనర్ బాలు రు చేసిన అకృత్యాల వీడియోలు బయటకు రావడంతో ఈ వీడియోలను అంతర్జాలం నుంచి తొలగించి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితుల్లో ఒక బాలిక ఇంకా అపస్మారక స్థితిలో ఉండగా ఆమె పరిస్థి తిని చూసి న్యాయం చేయాలని కాశీబుగ్గ పోలీసులకు తల్లి ఆశ్రయించింది. శనివారం సాయంత్రం బర్త్‌డే పార్టీ పేరుతో ఇద్దరు బాలికలపై ఇద్దరు బాలురు అత్యాచారం చేయడం, మరో బాలిక అంగీకరించకుండా బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే ఇద్దరు బాలురు చేసిన అత్యాచారాన్ని మరో బాలుడు వీడియో తీయడం వంటి అంశాలపై పోలీసుల ఎదుట వీడియో తీసిన బాలుడు అంగీకరించినట్లు సమాచారం. అంతకు ముం దు ఈ వ్యవహారంలో బేరసారాలు జరగ్గా ఈ విషయం పోలీసులకు తెలియడం తో సదరు పెద్ద మనుషులు తప్పుకున్నట్లు తెలిసింది. ఆదివారం విషయం పత్రికల్లో రావడంతో వ్యవహారం మొత్తం వెలుగుచూసింది. ఇందులో ఓ బాలిక ఆ ఘటన నుంచి ఇంకా తేరుకోక పోవడంతో ఆమె తల్లి తన కుమార్తెకు న్యాయం చేయా లని ఆదివారం మధ్యాహ్నం పోలీసుల కు ఫిర్యాదు చేసింది. సీఐ డి.మోహనరావు ముగ్గురు బాలురపై ఫోక్సోతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిందితులకు కఠిన శిక్ష పడాలి: ఎమ్మెల్యే శిరీష
ఈ ఘటనపై పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పోలీస్టేషన్‌కు వెళ్లి బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని సీఐని కోరారు. గంజా యికి బానిస కావడం వల్లే మైనర్ బాలురు ఈ ఘట నకు పాల్పడ్డారని ఆమె వైసీపీ ప్రభుత్వ తీరుపై విమ ర్శించారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో బాలిక తల్లితో శిరీష మాట్లాడి వివరాల తెలుసుకున్నారు. అనంతరం సీఐతో చర్చించారు. ఈ ఘటనపై ఆమె విచారం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఇటువంటి ఘటన ల్లో యువతులు మృతిచెందగా సెటిల్‌మెంట్లు చేసి కేసులు లేకుండా చేశారని, అటువంటి విధానా లకు తావు లేకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకో వాలని ఆమె కోరారు. ఆమె వెంట ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, టీడీపీ నేతలు బడ్డ నాగరాజు, సప్ప నవీన్, డొక్కరి శంకర్ , జోగ మల్లి, గోళ్ల చంద్రరావు, కొరికాన శంకర్ తదితరు లున్నారు.
నిందితులపై చర్యలు తీసుకోవాలి
బర్త్‌డే పార్టీకి పిలిచి ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసు కోవాలని పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ ఒక ప్రకటనలో డిమాండ్ చేసారు. తమ బిడ్డల భవిష్యత్‌ను, పరువును దృష్టిలో పెట్టుకుని బాధిత కుటుంబాలు ఫిర్యాదు ఇచ్చేందుకు ముందుకు రాలేక పోతున్నాయన్నారు.
బాధాకరం: మాజీ మంత్రి అప్పలరాజు
ఇద్దరు బాలికలపై అఘాయత్నం బాధాకరమని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలపై రాష్ట్రంలో అనేక అఘాయత్యాలు జరుగుతున్నాయని, నేడు పలాసలో జరగడం ఆశ్చర్యానికి గురిచేసిం దన్నారు. బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.