మానసికోల్లాసానికి క్రీడలు దోహదం
ABN , Publish Date - Sep 04 , 2024 | 11:57 PM
:మానసికోల్లాసానికి క్రీడలు దోహదపడతాయని జిల్లా పీఆర్ జేఏసీ సెక్రటరీ జనరల్ కేసీహెచ్ మహంతి తెలిపారు.బుధవారం శ్రీకాకుళంలో ఇంజనీర్స్‌డే పురస్కరించుకుని పీఆర్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో ఆటల పోటీలు ప్రారంభించారు.
శ్రీకాకుళం స్పోర్ట్స్:మానసికోల్లాసానికి క్రీడలు దోహదపడతాయని జిల్లా పీఆర్ జేఏసీ సెక్రటరీ జనరల్ కేసీహెచ్ మహంతి తెలిపారు.బుధవారం శ్రీకాకుళంలో ఇంజనీర్స్‌డే పురస్కరించుకుని పీఆర్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో ఆటల పోటీలు ప్రారంభించారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన వాలీబాల్ పోటీల్లో పాలకొండ విజేతగా, ఎచ్చెర్ల రన్నర్‌గా నిలిచాయి. గురువారం నుంచి శివా నీ కళాశాల ఆవరణలో క్రికెట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. కార్య క్రమంలో ఏఈలు ఎస్.పోలినాయుడు, అంజిత్ కుమార్ పాల్గొన్నారు.