Share News

తాగునీటి సమస్యలను పరిష్కరించండి

ABN , Publish Date - Oct 19 , 2024 | 11:36 PM

పలాస నియోజకవర్గంలో తాగునీటి సమస్యలను పరిష్క రించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు.

తాగునీటి సమస్యలను పరిష్కరించండి
విరాళాల చెక్కును సీఎం చంద్రబాబుకు అందిస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): పలాస నియోజకవర్గంలో తాగునీటి సమస్యలను పరిష్క రించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. ఈ మేరకు శనివారం విజయ వాడలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కృష్ణకాంత్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మునిసిపాలిటిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, కిడ్నీ ప్రభా విత ప్రాంతాల్లో సుర క్షితనీరు అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అలాగే వజ్రపుకొత్తూరు మండలం పూడిలంక గ్రామా నికి బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించా లని కోరారు. ఉద్దానం ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో కిడ్నీ బాధితులున్నారని, స్వచ్ఛమైన నీటిని అందించా లన్నారు. పూడిలంక గ్రామం చుట్టూ నీరు ఉంటుం దని, రోడ్డు లేకపో వడంతో నీటిలోనే ప్రమాదకరంగా రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఉందని, అందు వల్ల బ్రిడ్జి నిర్మాణం చేయాలన్నారు. గత టీడీపీ హ యాంలో రహదారి సగం వరకు నిర్మించామని, తరు వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తి చేయ లేదన్నా రు. వీటిపై కమిషనర్‌ సానుకూలంగా స్పదించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారని ఎమ్మెల్యే తెలిపారు.
సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.2.51 లక్షలు
పలాస, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2.51 లక్షల చెక్కును సీఎం చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే గౌతు శిరీష అందించారు. ఈ మొత్తంలో మదర్‌థెరిసా విద్యాల యం చైర్మన్‌ వజ్జ గంగాభవాని రూ.లక్ష, సాయిశిరీష స్కూల్‌ ప్రిన్సిపాల్‌ కవిటి భారతి రూ. 50 వేలు, లయన్స్‌ క్లబ్‌ రూ.80 వేలు, రిటైర్డ్‌ ఆర్మీ సిబ్బంది రూ. 21 వేలు అందించడంతో ఆ మొత్తం చెక్కును శని వారం విజయవాడలో సీఎంకు అందించారు.

Updated Date - Oct 19 , 2024 | 11:36 PM