Share News

పీహెచ్‌సీల్లో ఓపీ పెంచాలి: ఎమ్మెల్యే బగ్గు

ABN , Publish Date - Dec 01 , 2024 | 12:14 AM

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యసేవలను అందించే ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఓపీ మరింత పెరిగేందుకు వైద్య సిబ్బంది పనితీరు మెరుగుపడాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు.

పీహెచ్‌సీల్లో ఓపీ పెంచాలి: ఎమ్మెల్యే బగ్గు
మాకివలస పీహెచ్‌సీలో సేవలపై రోగులకు అడిగితెలుసుకుంటున్న బగ్గు రమణమూర్తి

నరసన్నపేట, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యసేవలను అందించే ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఓపీ మరింత పెరిగేందుకు వైద్య సిబ్బంది పనితీరు మెరుగుపడాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు. శనివారం మాకివలస పీహెచ్‌సీ సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసవాలు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో అయ్యేలా సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలి పారు. పాముకాటు, కుక్కకాటు మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మధుసూదనరావు, తహసీల్దార్‌ సత్యనారాయణ, శిమ్మ చంద్రశేఖర్‌, యాళ్ల వేణుగోపాలరావు పాల్గొన్నారు. కాగా కిల్లాంలో వీహెచ్‌పీ ఆధ్వ ర్యంలో జరిగిన వనభోజనాల్లో పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2024 | 12:14 AM