డిగ్రీ ఆరో సెమిస్టర్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:24 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న ఆరో సెమిస్టర్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఇవ్వనున్నట్లు వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఆరో సెమిస్టర్ చదువుతున్న 5,540 మంది విద్యార్థులకు ఈనెల 15 నుంచి మే 15వ తేదీ వరకు మూడునెలలపాటు ఇంటర్న్‌షిప్ జరుగుతుందని పేర్కొన్నారు. నిర్ధేశించిన విభాగాల్లో విద్యార్థులు ఇంటర్న్‌షిప్ పూర్తిచేయాలని కోరారు.
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న ఆరో సెమిస్టర్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఇవ్వనున్నట్లు వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఆరో సెమిస్టర్ చదువుతున్న 5,540 మంది విద్యార్థులకు ఈనెల 15 నుంచి మే 15వ తేదీ వరకు మూడునెలలపాటు ఇంటర్న్‌షిప్ జరుగుతుందని పేర్కొన్నారు. నిర్ధేశించిన విభాగాల్లో విద్యార్థులు ఇంటర్న్‌షిప్ పూర్తిచేయాలని కోరారు.
మూల్యాంకనం ప్రారంభం
వర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల మూడో సెమి స్టర్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లాలోని ఆరు కేంద్రాల్లో సోమ వారం ప్రారంభమైందని వీసీ తెలిపారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ, మహిళా డిగ్రీ కళాశాలలు, గాయత్రీ (మునసబుపేట), నరసన్నపేట, టెక్కలిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో, జీసీఎస్‌ఆర్ కళాశాల(రాజాం)లో ఈనెల 21వ తేదీ వరకు మూల్యాంకనం జరుగుతుందని పేర్కొన్నారు.