Share News

ఘనంగా ఇంజనీర్స్‌ డే

ABN , Publish Date - Sep 15 , 2024 | 11:46 PM

మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం జడ్పీ సమావేశ మందిరంలో.. జిల్లా పంచాయతీ రాజ్‌ ఇంజనీర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

ఘనంగా ఇంజనీర్స్‌ డే
రక్తదానం చేస్తున్న పంచాయతీరాజ్‌ ఇంజనీర్లకు ధ్రువపత్రాలను అందజేస్తున్న దృశ్యం

- పంచాయతీ రాజ్‌ ఆధ్వర్యంలో 47 యూనిట్ల రక్తం సేకరణ

శ్రీకాకుళం, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం జడ్పీ సమావేశ మందిరంలో.. జిల్లా పంచాయతీ రాజ్‌ ఇంజనీర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 47 యూనిట్ల రక్తాన్ని సేకరించి.. బ్లడ్‌బ్యాంక్‌కు అందజేశారు. ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలను వేసి నివాళి అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. అలాగే బెహరా మనోవికాస కేంద్రంలో దివ్యాంగులకు రూ. 5,116 నగదుతోపాటు పండ్లు పంపిణీచేశారు. కార్యక్రమంలో పీఆర్‌ ఐక్య కార్యాచరణ సమితి నాయకులు ఎస్‌.రామకృష్ణ, కేసీహెచ్‌ మహంతి, ఎస్‌శ్రీరాములు, ఎస్‌వీఏ పోలినాయుడు, కేఎస్‌ భరత్‌, పూర్వపు ఎస్‌ఈ ఏ ప్రభాకరరావు, జీఎస్‌ఆర్‌ గుప్తా, ఈఈ ఏఎస్‌ ప్రకాష్‌, డీఈలు, ఏఈలు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2024 | 11:46 PM