మతవిశ్వాసుల రక్షణ బాధ్యత ప్రభుత్వాలదే
ABN , Publish Date - Dec 01 , 2024 | 12:28 AM
మత విశ్వాసుల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని ప్రముఖ క్రైస్తవ ప్రచారకుడు బ్రదర్ అనిల్‌కుమార్ అన్నారు.
- బ్రదర్ అనిల్‌కుమార్
పొందూరు, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): మత విశ్వాసుల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని ప్రముఖ క్రైస్తవ ప్రచారకుడు బ్రదర్ అనిల్‌కుమార్ అన్నారు. పొందూరులో శనివారం జరిగి న ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి లేకరులతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వారి మతవిశ్వాసాల ను గౌరవించడంతో పాటు ఇతర మతాలను కూడా గౌరవిం చాలని, వారి విశ్వాసాలకు విలువనివ్వాలని కోరారు. మతాల పరంగా ప్రభుత్వం కొన్ని నిబంధనలు, విధానాలను విధిస్తుందని, వాటిని పాటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అనంతరం సీఎంసీ చర్చిలో నిర్వహించిన కార్యక్రమంలో అనిల్ ప్రసంగించారు.