హరిపురంలో బంగారం చోరీ
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:14 AM
మందస మండలంలోని హరిపురంలోని ఓ ఇంట్లో మంగళవారం రాత్రి ఎనిమిది తులాల బంగారం చోరీ జరిగింది.
హరిపురం: మందస మండలంలోని హరిపురంలోని ఓ ఇంట్లో మంగళవారం రాత్రి ఎనిమిది తులాల బంగారం చోరీ జరిగింది. మందస ఎస్‌ఐ ఖాదర్‌భాషా కథనం మేరకు.. హరిపురం బజారు వీధిలో పోస్టాఫీసు ఎదురుగా నివాసముంటున్న నల్ల మోహనరావు గతనెల 31న ఇంటికి తాళం వేసి విశాఖలో ఉంటున్న తన కు మారుడు ఇంటికి కుటుంబ సభ్యులతో వెళ్లారు. బుధవారం ఉదయం పక్కంటివారు చూసేసరికి తాళం విరిగి తలుపులు తీసి ఉండడంతో మోహనరావుకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే ఆయన విశాఖ నుంచి ఇంటిలో చూడగా బీరువా తాళాలు పగలు గొట్టి దొంగతనం జరిగినట్టు గుర్తించారు. ఈ మేరకు మోహనరావు ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని డీఎస్పీ పి.శ్రీనివాసరావు, సీఐ ఈశ్వరరావు, ఎస్‌ఐలు శ్రీకాకుళం నుంచి క్లూస్ టీం తెప్పించి పరిశీలించారు. ఘటనపై ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.