Share News

మాజీ మంత్రి అప్పలరాజుకు అస్వస్థత

ABN , Publish Date - Oct 31 , 2024 | 12:22 AM

): మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు డాక్టర్‌ సీదిరి అప్పలరాజు బుధవారం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను శ్రీకాకుళం మెడీకవర్‌ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు.

మాజీ మంత్రి అప్పలరాజుకు అస్వస్థత
చికిత్స పొందుతున్న అప్పలరాజు

శ్రీకాకుళం మెడికవర్‌లో చికిత్స

పలాస, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు డాక్టర్‌ సీదిరి అప్పలరాజు బుధవారం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను శ్రీకాకుళం మెడీకవర్‌ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరో గ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలి పారు. ఉదయం ఇంటి వద్ద జిమ్‌ చేస్తుండ గా అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యు లు వెంటనే శ్రీకాకుళం తరలించారు, స్వత హాగా గుండె సంబంధిత వైద్యాధికారి కావడంతో ప్రాథమిక చికిత్స ఆయనే స్వయంగా చేసుకున్నారు. సీటీ స్కాన్‌ నిర్వహించి ఎటువంటి ఇబ్బందులు లేవని డా.అన్నాజీరావు తెలిపారు. ఇదిలా ఉండగా అప్పలరాజు అస్వస్థతకు గురైన విష యం తెలుసుకున్న పలాస నియోజకవర్గ వైసీపీ నాయకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుసు కొని ఊపిరి పీల్చుకున్నారు. అప్పలరాజు వెంట ఆయన సతీమణి సీదిరి శ్రీదేవి ఉన్నారు.

Updated Date - Oct 31 , 2024 | 12:22 AM