మత్స్యకారులను అప్రమత్తం చేయాలి: తహసీల్దార్
ABN , Publish Date - Oct 19 , 2024 | 11:35 PM
వర్షాలు ఈనెల 24 నుంచి కురిసే అవకాశం ఉండడంతో మత్స్యకారులను అప్రమత్తం చేయాలని తహసీల్దార్ ఎన్.వెంకటరమణ అధికారులకు సూచించారు.
ఇచ్ఛాపురం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి):వర్షాలు ఈనెల 24 నుంచి కురిసే అవకాశం ఉండడంతో మత్స్యకారులను అప్రమత్తం చేయాలని తహసీల్దార్ ఎన్.వెంకటరమణ అధికారులకు సూచించారు. శనివారం డొంకూరు తీర ప్రాంతా న్ని సందర్శించారు. అనంతరం తుఫాన్ రక్షిత భవనంలో రెవెన్యూ,సచివాలయ ఉద్యోగులతో మాట్లాడారు. మత్స్యకా రులు వేటకు వెళ్లకుండా చాటింపు వేయాలని, రక్షిత భవనంలో మౌలిక సదుపాయాల ఏర్పాటు చేయాలని కోరారు.